అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shubman Gill | ఇంగ్లాండ్(England)లో జరుగుతున్న రెండో టెస్ట్ లో భారత జట్టు కొత్త టెస్ట్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ పరుగుల వరద పారించాడు. 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్, రెండో మ్యాచ్‌లో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ట్రిపుల్ సెంచరీకి చేరువగా వచ్చి ఔట్ కావడం అభిమానులను నిరాశపరిచింది. ఈ విధ్వంసం తర్వాత టీమిండియా యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Captain Shubman Gill) సోషల్ మీడియాలో మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. గిల్ ఇచ్చిన ఒక పాత ఇంటర్వ్యూలోని కామెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
Shubman Gill | పాత వీడియో..
ఈ వీడియోలో గిల్ టెస్ట్ క్రికెట్‌ను ఎలా ఆడాలి? ఆటగాడిగా ఎలా ఆలోచించాలి? అనే విషయాల్లో ఒక మాస్టర్ క్లాస్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్(Test cricket) అనేది ఓపికతో ఆడాల్సిన ఆట అని చెప్పుకొచ్చాడు. త్వరగా అవుటైతే రోజంతా బయట కూర్చోవాల్సి వస్తుంది. క్రీజులో ఉండడమే ముఖ్యం. పరుగులు చేసేవాడు క్రీజులోనే ఉంటాడు. బంతిని గాలిలోకి కొట్టకుండా గ్రౌండ్ షాట్లతో ఆడాలి. టాస్ బంతులను మాత్రం మిస్ చేయకుండా బౌండరీకి తరలించాలని గిల్ అన్నాడు. గిల్ మాటలను లోతుగా ఆలోచన చేస్తే అతని ఆటలో డిసిప్లిన్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.
అయితే ఫుల్ టాస్ బంతులను బలంగా బాదాలని చెప్పిన గిల్, ఆ బంతులను వదిలేస్తే మనమే చాలా బాధపడాల్సి వస్తుంది.. రిస్క్ తీసుకోవాల్సిన స్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలి అని అన్నాడు. అంటే దూకుడు అవసరం, కానీ అది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అన్న గిల్ మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత రెండు సీజన్లుగా గిల్ టెస్ట్ మరియు వన్డేల్లో మెచ్యూర్డ్ ఇన్నింగ్స్‌లతో జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు జింబాబ్వే టూర్(Zimbabwe Tour)కు టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన గిల్, పాత వీడియోలో చెప్పిన మరో మాట ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. “జట్టును నిరాశపెట్టకూడదు. ఒక్క ఆటగాడు ఓటమికి కారణం కాకూడదు. నమ్మినవారి విషయంలో నైతికంగా, నిజాయితీగా ఉండాలి అని ఆయన చెప్పిన మాటలని బట్టి చూస్తే.. గిల్ వ్యక్తిత్వం ఎంత ప్రొఫెషనల్ ఆటగాడి మాదిరిగా ఉందో చెబుతోంది. అతను కెప్టెన్‌గా మరింత పరిపక్వతతో వ్యవహరిస్తున్నాడని ఇప్పటికే క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.