అక్షరటుడే, వెబ్‌డెస్క్ : BCCI | ఐపీఎల్‌లో తన టీమ్‌ని ఫైనల్ వరకు తీసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్‌ను ఆసియా కప్‌కు ఎంపిక చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అంతేకాదు సెలక్షన్ కమిటీపై కొందరు విమర్శలు గుప్పించారు.
ఇక ఇదే సమయంలో రోహిత్ శర్మ వారసుడిగా అయ్యర్ వన్డే సారథ్య బాధ్యతలు స్వీకరిస్తాడని ప్రచారం సాగుతోంది. కాగా.. 2025 ఆసియా కప్(2025 Asia Cup) జట్టులో చోటు దక్కకపోయినా.. టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ అయిన శ్రేయస్‌కు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే యోచనలో బీసీసీఐ (BCCI) ఉందన్న వార్తలు జోరుగా చర్చకు తెరలేపాయి. వన్డే ఫార్మాట్‌కు ఒక ప్రత్యేక సారథి అవసరమన్న హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఆలోచనల నేపథ్యంలో ఈ వార్తలు ఊపందుకున్నాయి.
BCCI | అవాస్తవం..
ప్రస్తుతం టీ20కి సూర్యకుమార్ యాదవ్, టెస్టులకు శుభ్‌మన్ గిల్ సారథులుగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వన్డేలకు శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer)ను కెప్టెన్‌గా ఎంపిక చేయాలని BCCI యోచనలో ఉందన్న ప్రచారం సోషల్ మీడియాలో పీక్స్‌కు చేరింది. ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉన్న నేపథ్యంలో, 2027 వన్డే ప్రపంచకప్ వరకు ఆయన కొనసాగడం కష్టమేనన్న అభిప్రాయాలు కూడా ఈ ప్రచారానికి బలాన్ని చేకూర్చాయి. ఇది అయ్యర్‌కు కెప్టెన్సీ రేసులో అవకాశాలు కల్పిస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై BCCI సెక్రెటరీ దేవజిత్ సైకియా(BCCI Secretary Devajit Saikia) స్పష్టత ఇచ్చారు. ఓ జాతీయ మీడియా ఛానెల్‌తో మాట్లాడిన ఆయన “వన్డే కెప్టెన్సీ మార్పుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగలేదు. ఇది పూర్తిగా ఊహాగానమే” అని తేల్చేశారు.
అయినా కూడా వన్డే కెప్టెన్సీ విషయంలో శుభ్‌మన్ గిల్ (Shubhman Gill)తో శ్రేయస్ అయ్యర్ పోటీ రోజురోజుకు తీవ్రంగా మారుతోంది. అయ్యర్.. గత వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. వన్డేల్లో తన గణాంకాలు బలంగా ఉన్నాయి. ఇక గిల్ విషయానికి వస్తే వన్డేల్లో సగటు 59తో రాణిస్తూ.. ప్రస్తుతం వైస్ కెప్టెన్ పాత్ర పోషిస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్‌గా ఇటీవలే తన నైపుణ్యాన్ని కూడా ప్రదర్శించాడు. ఇటీవల ఒక బీసీసీఐ అధికారి మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండే అవకాశం ఉంది. ఆ బాధ్యత గిల్ భుజాలపై వేసే అవకాశముంది. కానీ అది ఎప్పుడన్నది కాలమే చెబుతుంది అని చెప్పుకొచ్చారు.