Homeక్రీడలుShreyas Iyer | ఐసీయూలో శ్రేయస్‌ అయ్యర్..

Shreyas Iyer | ఐసీయూలో శ్రేయస్‌ అయ్యర్..

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో శ్రేయస్​ అయ్యర్​ గాయపడిన విషయం తెలిసిందే. అతడికి అంతర్గతంగా బ్లీడింగ్​ కావడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shreyas Iyer | టీమిండియా (Team India) బ్యాట్స్​మన్​ శ్రేయస్​ అయ్యర్​ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఆసీస్​తో జరిగిన మూడో వన్డేలో క్యాచ్​ పట్టిన సమయంలో ఆయన గాయపడిన విషయం తెలిసిందే.

సిడ్నీ వేదికగా అక్టోబర్​ 25న జరిగిన చివరి వన్డేలో భారత్​ ఘన విజయం సాధించింది. అయితే ఫీల్డింగ్‌ చేస్తుండగా భారత ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్ (Shreyas Iyer) తీవ్రంగా గాయపడ్డాడు. హర్షిత్ రానా వేసిన 34 ఓవర్ నాలుగో బంతి అలెక్స్ క్యారీ బ్యాట్ ఎడ్జ్ తీసుకొని గాల్లోకి లేచింది. అయ్యర్​ వెనక్కి పరిగెడుతూ వెళ్లి ఆ క్యాచ్​ పట్టుకున్నాడు. అయితే ఆ సమయంలో ఆయన గాయపడ్డాడు.

Shreyas Iyer | నొప్పితో విలవిల

క్యాచ్‌ అందుకొనే క్రమంలో శ్రేయస్​ అయ్యార్​ కింద పడ్డాడు. దీంతో అతడి ప్లీహానికి తీవ్ర గాయమైంది. దీంతో ఆయన నొప్పితో విలవిలలాడాడు. అనంతరం మైదానాన్ని వీడాడు. అయితే బీసీసీఐ (BCCI) అయ్యర్​ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తోంది. అతడికి కడుపులో రక్తస్రవం అయినట్లు సమాచారం. దీంతో వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నుంచి ఏడు రోజులు అయ్యర్ వైద్యుల పర్యవేక్షణలో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించాయి. కాగా ఆసిస్​తో  తొలి వన్డేలో అంతగా ఆకట్టుకోని శ్రేయాస్ రెండో వన్డేలో హఫ్ సెంచరీతో సత్తా చాటాడు. మూడో వన్డేలో గాయపడి మధ్యలోనే మైదానాన్ని వీడాడు.