60
అక్షరటుడే, ఆర్మూర్ : Armoor | ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా శ్రావణి (Municipal Commissioner Shravani) నియమితులయ్యారు. ఈ మేరకు ఆమె సోమవారం కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డిని (Collector Vinay Krishna Reddy) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల ఆర్మూర్ కమిషనర్ రాజు (Armoor Commissioner Raju) ఓ ఇంటి అనుమతి విషయంలో రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు (ACB officials) పట్టుబడ్డ విషయం తెలిసిందే. అనంతరం నిజామాబాద్ డిప్యూటీ కమిషనర్ రవిబాబును ఆర్మూర్ మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్గా నియమించారు. కాగా ప్రభుత్వం శ్రావణిని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్గా నియమించడంతో ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు.