అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో ఆదివారం మహాత్మ స్వచ్ఛంద సంస్థ (Mahatma Charitable Organization) ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించారు. సంస్థ ఆవరణలోని పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా మహాత్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం ఒక గంట నినాదంతో చేస్తున్న మా ఈ స్వచ్ఛ కార్యక్రమం (cleanliness program) విజయవంతంగా 29 వారాలు పూర్తి చేసుకుందన్నారు. తపస్వీ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు వసతి కల్పించి చదివించడం ఎంతో అభినందనీయమన్నారు. ఇటువంటి సంస్థకు ప్రజలు తమకు తోచిన విధంగా సహాయం చేయాలన్నారు.
అనంతరం తమ వంతుగా రైస్ బ్యాగును అందజేశారు. కార్యక్రమంలో తపస్వీ స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రెటరీ దిలీప్, డైరెక్టర్ శ్రీనివాస్, అడ్మిన్ ఇన్ఛార్జి కవిత, వైస్ ప్రిన్సిపాల్ అనూష, సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్, సుమన్, శ్యాంసుందర్, ఒత్తూరు రాజన్న, కుతాడి ఎల్లయ్య, జంగిడి భోజన్న, నూకల ఆధత్య తదితరులు పాల్గొన్నారు.
