అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: CP Sai Chaitanya | అంతర్జాతీయ స్విమ్మింగ్లో (international swimming) సత్తాచాటి ఇందూరు పేరు నిలబెట్టాలని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. సీపీ కార్యాలయంలో రాష్ట్రస్థాయి స్విమ్మింగ్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను ఆయన అభినందించారు.
మోపాల్ పోలీస్స్టేషన్లో (Mopal Police Station) పోలీస్కానిస్టేబుల్గా పనిచేస్తున్న హరికృష్ణ పిల్లలు మోహన్, వినమ్రలు రాష్ట్రస్థాయి స్విమ్మింగ్లో ప్రతిభ చూపారు. ఈ సందర్భంగా మంగళవారం సీపీ సాయిచైతన్యను వారు మర్యాదపూర్వకంగా కలిశారు. వీరిని సీపీ ప్రత్యేకంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డిపార్ట్మెంట్లో ఉద్యోగుల పిల్లలు క్రీడల్లో రాణిస్తుండడం అభినందనీయమన్నారు. జాతీయస్థాయిలో సత్తాచాటి ఇందూరు పేరు నిలబెట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) జి బస్వా రెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి, సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.