అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా యువజన క్రీడా అధికారి (DYSO) పవన్ కుమార్ తెలిపారు. ఆదివారం నగరంలోని పాత కలెక్టరేట్ మైదానంలో ఉమ్మడి జిల్లా ఎంపిక పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడినేనని ఎన్నో పథకాలు సాధించినట్లు గుర్తు చేసుకున్నారు. ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులు ఈనెల 22 నుంచి 24 వరకు కొమురంభీం జిల్లాలో (Komurambheem District) జరిగే రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ ప్రధాన కార్యదర్శి శ్యాం, పీఈటీలు పాల్గొన్నారు.