అక్షరటుడే, మెండోరా: School Games | క్రీడాకారులు జాతీయస్థాయిలో ప్రతిభ చూపి మెండోరా మండలానికి (Mendora mandal) పేరు తేవాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (MLA Prashanth Reddy) పేర్కొన్నారు. మండల కేంద్రంలో 69వ ఎస్జీఎఫ్ అంతర పాఠశాలల క్రీడోత్సవాలను (SGF Inter-School Sports Festival) బుధవారం ఆయన ప్రారంభించారు.
క్రీడాజ్యోతిని వెలిగించి.. క్రీడాకారుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. క్రీడల ద్వారా శారీరక మానసిక వికాసం సాధ్యమవుతుందన్నారు. శిక్షణ పట్టుదలతో ముందుకు సాగి రాష్ట్ర, జాతీయస్థాయి క్రీడల్లో మెండోరాకు పేరు ప్రతిష్టలు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నాగంపేట్ శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
