అక్షరటుడే, గాంధారి: Collector Kamareddy | గాంధారి మండలంలోని వండ్రీకల్ ప్రభుత్వ పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. నిర్వహణ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ హెచ్ఎం, పంచాయతీ సెక్రెటరీకి (Panchayat Secretary) నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Collector Kamareddy | పాఠశాల నిర్వహణపై అసంతృప్తి
గాంధారి మండలంలోని (Gandhari mandal) వండ్రీకల్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌ను కలెక్టర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సమయంలో విద్యార్థులు వరండాలో కూర్చుని చదువుకుంటుండడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల ఆవరణ చుట్టూ చెత్త పేరుకుపోయి ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు తరగతి గదుల్లోనే బోధన జరగాలని.. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని హెచ్ఎంకు సూచించారు.
మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్న వంటగదిని కలెక్టర్ (Collector Ashish Sangwan) పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. తరగతి గదుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్న ప్రధానోపాధ్యాయుడికి నోటీసులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారి రాజుకు సూచించారు. అలాగే శానిటేషన్‌లో నిర్లక్ష్యం వహించిన పంచాయతీ సెక్రెటరీ వెంకటచారికి నోటీసులివ్వాలని సంబంధిత అధికారికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Collector Kamareddy | రైతులకు యూరియా ఇబ్బంది లేకుండా చూడాలి..
గాంధారి మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాప్‌ను కలెక్టర్ తనిఖీ చేశారు. యూరియా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. యూరియా విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని షాపు యజమానులకు, ఏఈవోకు సూచించారు. కలెక్టర్ వెంట ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డీఈవో రాజు, డీఈర్డీవో సురేందర్, డీపీవో మురళి, తహశీల్దార్ రేణుక, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంఈవో శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.