అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | ఎన్నికల్లో విధులు (election duties) నిజాయితీగా నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా పని చేయవద్దని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తున్నా అనేక మంది అధికారులు పెడచెవిన పెడుతున్నారు.
బుధవారం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు (panchayat elections) జరగనున్నాయి. మంగళవారం ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రం వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంది. అయితే విధులకు హాజరు కావాల్సిన 39 మంది పోలింగ్ సిబ్బంది అధికారులకు రిపోర్ట్ చేయలేదు. దీంతో ఈ విషయం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) దృష్టికి తీసుకెళ్లగా..కలెక్టర్ ఆదేశాలతో జిల్లా విద్యాశాఖ అధికారి, ట్రైనింగ్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి రాజు 39 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.