ePaper
More
    HomeతెలంగాణArmoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు.. మూడు సార్లు ప్రారంభోత్సవాలా.. మాజీ...

    Armoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు.. మూడు సార్లు ప్రారంభోత్సవాలా.. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్: Armoor Former MLA | చట్టభద్రత లేని పసుపు బోర్డుకు ముచ్చటగా మూడుసార్లు ప్రారంభోత్సవాలు చేసిన ఘనత కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి దక్కిందని బీఆర్​ఎస్​ జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి (BRS District President Jeevan Reddy) అన్నారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పసుపు బోర్డును పదేపదే ప్రారంభిస్తూ బీజేపీ రైతులను (Farmers) మోసగిస్తోందన్నారు. పసుపు బోర్డు నేమ్ ప్లేట్ నిజామాబాద్​లో (Nizamabad) ఉందని.. కానీ ఆఫీసు కార్యాకలాపాలు ఢిల్లీలో జరుగుతున్నాయంటూ విమర్శించారు. ఇలా జరగడం వల్ల జిల్లా పసుపు రైతులకు (turmeric farmers) ఒరిగేదేమిటని ప్రశ్నించారు.

    గెలిచిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు తెస్తానని ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Dharmapuri Arvind) బాండ్ పేపర్ రాసిచ్చి మరీ ప్రజలను మభ్యపెట్టారన్నారు. పదేళ్ల తరువాత కూడా రైతులు విశ్వసించే విధంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని జీవన్​రెడ్డి విమర్శించారు. పసుపు బోర్డు స్థానంలో స్పైసెస్ బోర్డు కార్యాలయాన్ని (Spices Board office) సాధించానని ఇప్పటి వరకు చెప్పుకున్నారని గుర్తు చేశారు. పసుపు బోర్డు కంటే స్పైసెస్ బోర్డు మేలంటూ ప్రజలను మభ్యపెడుతూ వచ్చారని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పసుపు బోర్డు (Turmeric Board) కావాలని అడిగే వారంతా బుద్ధిహీనులని అర్వింద్ గతంలో అన్నారని..​ ఇప్పుడు పసుపు బోర్డును తానే సాధించానని చెబుతున్నారని పేర్కొన్నారు.

    అసలు బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో రైతుల పోరాటం ఫలితంగానే నామమాత్రంగానైనా పసుపు బోర్డు వచ్చిందని జీవన్​ రెడ్డి న్నారు. గత ఎన్నికల సమయంలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) స్వయంగా ప్రకటించారని గుర్తు చేశారు. అయితే ఏడాది గడిచాక కూడా బోర్డు స్థాపన జరగలేదని పేర్కొన్నారు. దీంతో పసుపు రైతుల్లో అసంతృప్తి చెలరేగుతున్న తరుణంలో హడావుడిగా గత జనవరి 14న పసుపు బోర్డును కేంద్ర వాణిజ్య మంత్రి పీయుష్ గోయల్ (Minister Piyush Goyal) వర్చువల్​గా ప్రారంభించారన్నారు. ఇప్పుడు అదే కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా మరోసారి ప్రారంభించి నవ్వులపాలయ్యారని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఒక బోర్డుకు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారని ఆయన ప్రశ్నించారు.

    More like this

    India-Pakistan | మ‌రో నాలుగు రోజుల్లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌.. ఇంకా అమ్ముడుపోని టిక్కెట్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India-Pakistan | అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో హై వోల్టేజ్‌గా పేరొందిన భారత్ vs పాకిస్తాన్...

    Apple iPhone 17 | ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ఐఫోన్ 17 సిరీస్ విడుదల.. అతి సన్నని మొబైల్ ఫీచర్లు, ధర వివ‌రాలు ఇవే

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Apple iPhone 17 | టెక్ ప్రియులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న Apple iPhone...

    High Court | పవన్‌ కల్యాణ్‌ ఫొటోలు పెట్టొద్దు.. హైకోర్ట్‌లో పిల్ దాఖ‌లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : High Court | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో చట్టబద్ధమైన అనుమతి లేకుండా ఉప ముఖ్యమంత్రి...