అక్షరటుడే, వెబ్డెస్క్ : Fake Votes | బీహార్ ఎన్నికల ముందర చేపట్టిన ఓటార్ జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను విపక్షాలు విమర్శిస్తుండడంపై కేంద్ర ఎన్నికల సంఘం గురువారం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నకిలీ ఓట్లు(Fake Votes) వేయడానికి అనుమతించాలా? అని ప్రశ్నించింది. చనిపోయిన వారికి, వలస వచ్చిన వారికి కూడా ఓటర్ల జాబితాలో స్థానం కల్పించాలా? అని నిలదీసింది. భారీగా ఓట్లను తొలగిస్తున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చింది.
బీహార్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections) ముందు నిర్దిష్ట ఓటర్ల సమూహాల ఓటు హక్కును తొలగించడానికి ఎన్నికల కమిషన్ మరియు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఓటర్ల జాబితా సవరణను వాయిదా వేశాయని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్(Election Commission) నుండి ఈ ప్రకటన వచ్చింది. స్వచ్ఛమైన ఓటర్ జాబితాల రూపకల్పన, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ రాజ్యాంగం తమకు కల్పించిన బాధ్యత అని తేల్చి చెప్పింది. కేంద్ర మద్దతుతో బీహార్ ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (Special Intensive Revision) ను ఎన్నికల సంఘం మరోసారి గట్టిగా సమర్థించుకుంది.
Fake Votes | దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్..
భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి తల్లి వంటిదని, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను చేపట్టడమే తమ బాధ్యత అని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం బీహార్(Bihar)లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ ను తర్వాత దేశమంతా చేపడతామని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ఆరోపణలను తోసిపుచ్చింది. కొంత మంది చేస్తున్న తప్పుడు ఆరోపణలకు భయపడి చనిపోయిన వారి పేర్లతో, వలస వెళ్లిన వారి పేర్లతో నకిలీ ఓట్లు వేయించాలా? అని ప్రశ్నించింది. ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు, రెండు ప్రాంతాల్లో ఓట్లు వేసేందుకు చాన్స్ ఇవ్వాలా? అని నిలదీసింది. నకిలీ ఓట్లను తొలగించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపింది
Fake Votes | రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి..
మనమందరం రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలని ఈసీ హితవు పలికింది. “నిజమైన ఓటర్ల జాబితాను పారదర్శక ప్రక్రియ ద్వారా తయారు చేయడం, పారదర్శకంగా ఎన్నికల నిర్వహణను ఎన్నికల కమిషన్ చేపట్టడం బలమైన ప్రజాస్వామ్యానికి పునాది రాయి కాదా? ఈ ప్రశ్నలపై భారత పౌరులందరూ రాజకీయ సిద్ధాంతాలకు అతీతంగా లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ ముఖ్యమైన ఆలోచనకు సరైన సమయం ఇప్పుడు వచ్చింది” అని ఈసీ పేర్కొంది.
Fake Votes | 56 లక్షల ఓట్ల తొలగింపు..
ఎన్నికల కమిషన్ బుధవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. బీహార్ ఓటర్ల జాబితా(Bihar Voter List) నుంచి 56 లక్షల పేర్లను తొలగించడానికి గుర్తించారు. 56 లక్షల పేర్లలో 20 లక్షల మంది చనిపోయిన ఓటర్లు కాగా, 28 లక్షల మంది శాశ్వతంగా వేరే రాష్ట్రానికి వెళ్లినవారు ఉండగా, 7 లక్షల మంది మంది డబుల్ ఓట్లు కలిగి ఉన్నట్లు తేల్చారు. అదనంగా, కొనసాగుతున్న ప్రక్రియలో పంపిణీ చేసిన ఓటరు ధృవీకరణ ఫారాలను 15 లక్షల మంది తిరిగి ఇవ్వలేదు, దీని వలన వారు తుది జాబితా నుండి మినహాయించే అవకాశముంది..