అక్షరటుడే, ఎల్లారెడ్డి: Telangana Teachers Union | తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో చదివించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దీన్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండలం (Yellareddy mandal) కొట్టాల్ గ్రామంలోని పాఠశాల ఆవరణలో నిర్వహించిన పేరెంట్, టీచర్ మీటింగ్లో మాట్లాడారు. గ్రామంలోని 5-14 ఏళ్ల పిల్లలతో పాటు బాలికలను చదివించాలన్నారు. అనంతరం ఇటీవలి పదో తరగతి, ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ మార్కులు పొందిన విద్యార్థినులు బోదాస్ లావణ్య (513), బోదాస్ స్నేహ (509), ద్యావల్ల శ్రీలత, ఇంటర్ విద్యార్థిని దేవికృపను అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో వార్డు మాజీ మెంబర్ బోదాస్ సాయిరాం, గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
