అక్షరటుడే నిజాంసాగర్: Mla Laxmi Kantha rao | నియోజకవర్గంలోని సీనియర్ కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు పేర్కొన్నారు.
పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ (Market Committee) కార్యాలయంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ సమస్యలను పరిష్కరించే దిశగా పని చేయాలన్నారు. అనంతరం నాయకులు మండల పరిధిలోని గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు.
నీటి సౌకర్యం, రోడ్లు, తాగునీరు, గ్రామాల్లో నిలిచిపోయిన భవన నిర్మాణ పనులు, కాంపౌండ్ వాల్, డ్రెయినేజీలు వంటి మౌలిక సదుపాయాల గురించి ఎమ్మెల్యేతో వారు చర్చించారు. దీంతో ఎమ్మెల్యే ఆయా శాఖలకు చెందిన అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి చొరవ చూపారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు హన్మాండ్లు, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, సాయిరెడ్డితో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.