అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | నగరంలోని దేవీ రోడ్డులో (Devi Road) వ్యాపారస్తులు తమ దుకాణాలను శనివారం మూసి ఉంచి నిరసన వ్యక్తం చేశారు. వన్ వే (one-way) ఏర్పాటు చేయడంతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.
ట్రాఫిక్ ఇబ్బందుల (traffic problems) దృష్ట్యా పోలీసులు ఇటీవల నగరంలోని పలు ప్రాంతాల్లో వన్ వే ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా దేవి రోడ్డునూ వన్వేగా మార్చారు. దీంతో తమకు నష్టాలు వాటిల్లుతున్నాయని, వన్ వే తొలగించాలని వ్యాపారస్తులు పోలీసులను కోరారు.