Movie Shootings
Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి టాలీవుడ్ (Tollywood)​లో షూటింగ్స్​ బంద్​ చేస్తున్నట్లు ఫెడరేషన్​ ప్రతినిధులు ప్రకటించారు. కార్మికులకు 30శాతం వేతనాలు పెంచాలని వారు డిమాండ్​ చేశారు. రేపటి నుంచి వేతనాలు పెంచి ఇవ్వాలన్నారు. అలా అయితేనే షూటింగ్​లో పాల్గొంటామని స్పష్టం చేశారు.

వేతనాలు (Wages) పెండింగ్ లేకుండా రోజువారీగా ఇవ్వాలని కోరారు. 30శాతం వేతనాలు పెంచి ఇస్తామని ప్రొడ్యూసర్ (Producer)​ నుంచి లేఖ ఇస్తేనే.. సంబంధిత యూనియన్లకు తెలిపి విధులకు హాజరు కావాలని పేర్కొంది. ఫెడరేషన్​లోని 24 కార్మిక సంఘాలు దీనిని పాటించాలని కోరింది. ఇతర భాషా సినిమాలు, వెబ్‌సిరీస్‌లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది.

ఫెడరేషన్​ తరఫున కొంతకాలంగా వేతనాలు పెంచాలని కోరుతున్నారు. అయితే నిర్మాతల కౌన్సిల్​ వారి డిమాండ్లను పట్టించుకోలేదు. దీంతో ఫెడరేషన్​ ప్రతినిధులు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించారు. షూటింగ్​లో పాల్గొనకుండా నిరసన తెలుపుతామని ప్రకటించారు. దీంతో షూటింగ్​లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.