ePaper
More
    Homeఅంతర్జాతీయంUS lawmakers | US శాసనసభ్యుల కాల్చివేత.. అవి రాజకీయ హత్యలేనా..! మరికొందరి హత్యకు ప్లాన్​!

    US lawmakers | US శాసనసభ్యుల కాల్చివేత.. అవి రాజకీయ హత్యలేనా..! మరికొందరి హత్యకు ప్లాన్​!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: US lawmakers : అమెరికా(America)లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు US శాసనసభ్యులు హత్యకు గురయ్యారు. శనివారం తెల్లవారుజామున మిన్నెసోటా రాష్ట్ర(Minnesota state) ప్రతినిధి, ఆమె భర్త కాల్చి చంపబడ్డారు. ఒక రాష్ట్ర సెనేటర్, అతని భార్యను వారి ఇంట్లో గుర్తుతెలియని దుండగుడు కాల్చి చంపేశారని మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. నిందితుడు పోలీసు అధికారిగా వేషం వేసుకుని వచ్చినట్లు పేర్కొన్నారు.

    డెమొక్రాట్(Democrat) పార్టీ సభ్యురాలు, రాష్ట్ర ప్రతినిధి మెలిస్సా హోర్ట్‌మాన్​(Melissa Hortman)తో పాటు ఆమె భర్త మార్క్‌ను “రాజకీయంగా హత్య”గా కనిపించే విధంగా కాల్చి చంపినట్లు అని వాల్జ్ ప్రకటించారు. గతంలో మిన్నెసోటా ప్రతినిధుల సభ స్పీకర్ అయిన హోర్ట్‌మాన్ “ఒక బలమైన ప్రజా సేవకురాలు” అని గవర్నర్ తన స్నేహితుడి గురించి చెప్పుకొచ్చారు.

    డెమొక్రాట్ పార్టీ సభ్యురాలు రాష్ట్ర సెనేటర్ జాన్ హాఫ్‌మన్(Senator John Hoffman), అతని భార్య య్వెట్ కూడా కాల్పులకు గురయ్యారని గవర్నర్ తెలిపారు. హాఫ్‌మన్, అతని భార్యపై తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చాంప్లిన్‌లో కాల్పులు జరిపారని బ్యూరో ఆఫ్ క్రిమినల్ అప్రెహెన్షన్ సూపరింటెండెంట్ డ్రూ ఎవాన్స్ ప్రకటించారు.

    హాఫ్‌మన్‌ హత్యకు గురయ్యాక అధికారులు హోర్ట్‌మన్‌ ఇంటికి తెల్లవారుజామున 3:35 గంటలకు చేరుకున్నారు. కానీ, అక్కడ పోలీసు అధికారి దుస్తులు ధరించి, చొక్కా, బ్యాడ్జ్ ధరించి, టేజర్, ఇతర పరికరాలతో ఉన్న ఒక వ్యక్తి తలుపు హోర్ట్‌మన్ ఇంటి నుంచి బయటకు వస్తూ అధికారులకు కనిపించాడు. అధికారులను చూసి ఆ అనుమానితుడి వారిపై కాల్పులు జరిపి తన వాహనం అక్కడే వదిలి పారిపోయాడు.

    నిందితుడి వాహనం నుంచి పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. అతడి ఇతర టార్గెట్​ జాబితాతోపాటు హార్ట్‌మన్, హాఫ్‌మన్ పేర్లను పోలీసులు గుర్తించారు. వారితోపాటు సదరు జాబితాలో గవర్నర్ వాల్జ్(Governor Walz), యూఎస్ ప్రతినిధి ఇల్హాన్ ఒమర్(U.S. Representative Ilhan Omar), యూఎస్ సెనెటర్ టీనా స్మిత్(U.S. Senator Tina Smith), రాష్ట్ర అటార్నీ జనరల్ కీత్ ఎల్లిసన్(state Attorney General Keith Ellison) సహా మిన్నెసోటాలోని డజన్ల కొద్దీ ఇతర డెమొక్రాట్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు.

    More like this

    Banswada | ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయం : పోచారం

    అక్షరటుడే, బాన్సువాడ : Banswada | చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు చిరస్మరణీయమని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డి (MLA Pocharam...

    Nepal | 11 ఏళ్ల బాలిక వ‌ల్ల నేపాల్ ప్ర‌భుత్వం కూలిందా.. ఉద్యమం ఉద్రిక్త‌త‌కి దారి తీయడానికి కార‌ణం ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal | నేపాల్‌లో జెన్‌ జెడ్‌ యువత ప్రారంభించిన ఉద్యమం ఊహించని రీతిలో ఉద్రిక్తతకు...

    Nara Lokesh | నేపాల్‌లో ఉద్రిక్త వాతావ‌ర‌ణం.. సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్నిర‌ద్దు చేసుకున్న నారా లోకేష్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | నేపాల్‌(Nepal)లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య అక్కడ చిక్కుకున్న తెలుగువారిని...