అక్షరటుడే, ఇందల్వాయి: Firing in NH44 | జాతీయ రహదారిపై (national highway) కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ (Indalwai police station) పరిధిలో ఓ వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్ జిల్లా (Nizamabad district) ఇందల్వాయి మండలంలోని దేవితండా సమీపంలో ఓ దాబా వద్ద మంగళవారం సాయంత్రం యూపీకి (Uttar Pradesh) చెందిన సల్మాన్ అనే వ్యక్తి లారీ నిలిపాడు. కాగా.. మరో లారీలో ఇద్దరు వచ్చి అక్కడ ఆపారు. అనంతరం సదరు వ్యక్తిపై తుపాకీతో కాల్పులు జరిపారు. దీంతో సల్మాన్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. కాల్పులు జరిపిన దుండగులు చంద్రాయన్ పల్లి వద్ద లారీని వదిలేసి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.