HomeతెలంగాణHyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి!

Hyderabad | హైదరాబాద్​లో కాల్పుల కలకలం.. ఒకరి మృతి!

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్​లో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. పాతబస్తీ OLD CITY లో గంజాయి గ్యాంగ్​ వార్​.. ఒకరి దారుణ హత్య జరిగిన మరుసటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకో ఘటనతో మహా నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.

దిల్​సుఖ్​నగర్​ Dilsukhnagar లో మంగళవారం (జులై 15) తెల్లవారు జామున కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ Shalivahana Nagar Park సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.

పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హత్యకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad | నిన్ననే పాతబస్తీలో హత్య…

పాతబస్తీ Old Basti – చంద్రాయణగుట్ట Chandrayangutta లో సోమవారం ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతో గ్యాంగ్​ వార్​ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అజీజ్ అనే యువకుడి హత్యకు గురయ్యాడు. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా ప్రత్యర్థులు హతమార్చారు. ఆ మరుసటి రోజే మరో హత్య జరగడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.

నేరాల నియంత్రణకు తెలంగాణ సర్కారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రైం ఘటనలు ఆగడం లేదు. సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్ఠంగానే ఉంది. కమాండ్​ కంట్రోల్​ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారికంగా, ఉన్నతస్థాయిలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయికి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఈ క్రమంలోనే నేరాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేరాల కట్టడికి సైబరాబాద్​​ Cyberabad పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన పెంచాల్సి ఉంది.

Must Read
Related News