అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ వద్ద కాల్పులు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి వైట్‌హౌస్ సమీపంలో నేషనల్ గార్డు (National Guardsmen)లపై కాల్పులు జరిపాడు.
వైట్‌హౌస్ (White House) వద్ద కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అటువంటి ప్రదేశంలో కాల్పులు జరగడంతో అమెరికన్లు ఉలిక్కి పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నేషనల్ గార్డులు మృతి చెందినట్లు వెస్ట్ వర్జీనియా గవర్నర్ పాట్రిక్ మొరిసే తెలిపారు. అమెరికా (America) కాలమానం ప్రకారం బుధవారం వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరిగాయి. పశ్చిమ వర్జీనియాకు చెందిన ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై నిందితుడు తుపాకీతో కాల్పులు జరపడంతో వారు మృతి చెందారు. అప్రమత్తమైన బలగాలు అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నాయి.
America | స్పందించిన ట్రంప్
కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) స్పందించారు. నిందితుడు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కాల్పులు జరిపిన మృగాన్ని వదిలేది లేదన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిపై కఠిన చర్యలు అవసరమని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ట్వీట్ చేశారు. కాల్పుల అనంతరం అమెరికా ప్రభుత్వం (US Government) వాషింగ్టన్కు అదనంగా 500 మంది నేషనల్ గార్డ్ దళాలను మోహరించాలని ఆదేశించింది.
America | కాల్పులు జరిపింది అతడేనా..
అమెరికా మీడియా సంస్థల కథనాల ప్రకారం.. రహమానుల్లా లకన్వాల్ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు సమాచారం. 2021లో యునైటెడ్ స్టేట్స్లోకి ప్రవేశించిన 29 ఏళ్ల రహమానుల్లా అఫ్గానిస్థాన్‌కు చెందిన వాఉడు. ఫెడరల్ అధికారులు ఇప్పటికీ అతని నేపథ్యం మరియు ఉద్దేశ్యాన్ని పరిశీలిస్తున్నారు. శరణార్థుల కార్యక్రమం ద్వారా లకాన్వాల్ దేశంలోకి ప్రవేశించాడని అధికారులు గుర్తించారు. కాల్పుల్లో ఘటనలో అతడు సైతం గాయపడ్డట్లు సమాచారం.