అక్షరటుడే, వెబ్డెస్క్: Australia | ఆస్ట్రేలియాలో విషాదం చోటు చేసుకుంది. బీచ్లో పర్యాటకులపై (tourists) గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పది మంది చనిపోయారు.
ఆస్ట్రేలియా బోండీ బీచ్లో (Bondi Beach) ఆదివారం కాల్పులు చోటు చేసుకున్నాయి. ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో 10 మంది వరకు చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. యూదుల హనుక్కా వేడుకలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నెలల ముందుగానే ప్లాన్ చేసి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. కాగా పోలీసుల కాల్పుల్లో ఒక నిందితుడు చనిపోయాడు. మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Australia | ప్రధాని దిగ్భ్రాంతి
కాల్పుల ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ (Australian Prime Minister Anthony Albanese) స్పందించారు. బోండిలోని దృశ్యాలు దిగ్భ్రాంతికరమైనవి, బాధ కలిగించేవి అన్నారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన పోలీసులు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.17 గంటలకు కాల్పులు జరిగాయి. ఎనిమిది రోజుల యూదుల పండుగ హనుక్కా జరగనుంది. మొదటి రోజు కాల్పులు జరిగాయి. యూదుల పండుగ ప్రారంభానికి గుర్తుగా సముద్రతీర కార్యక్రమం కోసం వందలాది మంది బీచ్లో గుమిగూడిన సమయంలో దుండగులు దాడి చేశారు. దీంతో పోలీసులు ఘటన స్థలంలో గాలిస్తున్నారు. ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని కోరారు.