HomeUncategorizedAssam | వాళ్లు కనిపిస్తే కాల్చేయండి.. అస్సాం సీఎం కీలక ఆదేశాలు

Assam | వాళ్లు కనిపిస్తే కాల్చేయండి.. అస్సాం సీఎం కీలక ఆదేశాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assam | అస్సాం సీఎం (Assam CM) హిమంత బిస్వా శర్మ (Himanta Biswa Sharma) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలయాలను ధ్వంసం చేయడానికి రాష్ట్రంలోని దుబ్రి జిల్లా (Dubri District)లో ఒక గ్యాంగ్​ తిరుగుతోందని ఆయన పేర్కొన్నారు. వాళ్లు కనిపిస్తే కాల్చిపారేయాలని shoot at sight ఆదేశించారు. ఈ మేరకు షూట్​ ఎట్​ సైట్​ ఆర్డర్స్​ జారీ చేశారు.

అస్సాం ముఖ్యమంత్రి శుక్రవారం దుబ్రి జిల్లాలో పర్యటించారు. అనంతరం ఎక్స్​లో పోస్ట్​ పెట్టారు. జిల్లాలో ఒక గ్యాంగ్​ ఆలయాలను ధ్వంసం చేయాలనే లక్ష్యంతో తిరుగుతోందన్నారు. జిల్లా పరిస్థితులను అంచనా వేయడానికి పర్యటించినట్లు ఆయన పేర్కొన్నారు. అవసరం అయితే మరోసారి జిల్లాకు వస్తానని తెలిపారు.

Assam | ప్రభుత్వం మీతో ఉంది

అస్సాం ప్రభుత్వం మీతో ఉందని ఆయన దుబ్రీ జిల్లా వాసులకు సీఎం భరోసా కల్పించారు. ప్రజలకు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతామన్నారు. ఇటీవల ఒ పండుగ సందర్భంగా ఆలయంలోకి పశువుల మాంసం విసిరారు. అనంతరం జిల్లాలో మతపరమైన హింస చేలరేగింది. ఈ క్రమంలో అక్కడ పర్యటించిన సీఎం హింసకు పాల్పడే వారికి వార్నింగ్​ ఇచ్చారు. ఆలయాలు, ప్రార్థన స్థలాల అపవిత్రం చేసే వారిని వదిలి పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలి పెట్టమని ఆయన పేర్కొన్నారు.