Homeతాజావార్తలుMahabubabad Government General Hospital | అమానుష ఘటన.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన సిబ్బంది.....

Mahabubabad Government General Hospital | అమానుష ఘటన.. బతికున్న వ్యక్తిని మార్చురీలో పెట్టిన సిబ్బంది.. రాత్రంతా శ‌వాల మ‌ధ్య‌లోనే..!

Mahabubabad Government General Hospital | మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చోటుచేసుకున్న అమానుష ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బతికే ఉన్న వ్యక్తిని మృతుడని పొరపడి ఆసుపత్రి సిబ్బంది మార్చురీ గదిలో ఉంచి తాళం వేసిన సంఘటన తాజా వెలుగులోకి వచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Mahabubabad Government General Hospital | మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో Hospitalచోటుచేసుకున్న ఘోర నిర్లక్ష్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బతికున్న ఒక వ్యక్తిని మృతుడని పొరబడి మార్చురీలో ఉంచిన ఘటనపై ప్రజలు, సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి కిడ్నీ సమస్యలతో బాధపడుతూ మూడు రోజుల క్రితం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరాడు. అయితే అతనికి ఆధార్ కార్డు లేదా అటెండెంట్ లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది అడ్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. రెండు రోజుల పాటు ఆసుపత్రి ఆవరణలోనే ఆకలితో, అనారోగ్యంతో అలమటించిన రాజు చివరకు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు.

Mahabubabad Government General Hospital | మరణ భయంతో రాత్రంతా గడిపిన రాజు

ఆ సమయంలో కదలికలు లేవని భావించిన సిబ్బంది అతను మృతుడని అనుకుని స్ట్రెచర్‌పై మార్చురీ గదిలో ఉంచి తాళం వేశారు. బతికే ఉన్న రాజు Raju ఆ రాత్రంతా చల్లటి మార్చురీలో భయంతో వణికిపోయాడు. మరుసటి రోజు ఉదయం శుభ్రపరచడానికి వచ్చిన స్వీపర్ రాజు శరీరంలో కదలికను గమనించి వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు తక్షణం మార్చురీ తాళం తెరిపించి రాజును బయటకు తీశారు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఈ దారుణంపై స్థానికులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నారు. “ఆధార్ లేకపోయినా రోగికి చికిత్స ఇవ్వకపోవడం, బతికున్న వ్యక్తిని మార్చురీలో ఉంచడం మానవత్వానికి విరుద్ధం” అని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఆసుపత్రి ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. “బాధ్యులైన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆధార్ కార్డు Aadhar Card లేదా అటెండెంట్ లేకపోయినా ప్రతి రోగికి చికిత్స తప్పనిసరిగా అందించాలి” అని RMO స్పష్టం చేశారు.ఈ ఘటన ప్రభుత్వ వైద్య వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం, మానవతా లోపాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.