HomeUncategorizedBoycott Turkey | టర్కీకి షాక్​.. యాపిల్స్​ బాయ్​కాట్ చేసిన వ్యాపారులు

Boycott Turkey | టర్కీకి షాక్​.. యాపిల్స్​ బాయ్​కాట్ చేసిన వ్యాపారులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Boycott Turkey | టర్కీకి భారత వ్యాపారులు షాక్​ ఇచ్చారు. పహల్గామ్​ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్​ ఆపరేషన్​ సిందూర్​ చేపట్టిన విషయం తెలిసిందే. అనంతరం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. ఈ సమయంలో టర్కీకి పాకిస్తాన్​కు మద్దతు తెలిపింది. అంతేగాకుండా భారత్​పై దాడి చేయడానికి డ్రోన్లను దాయాది దేశానికి అందించింది. టర్కీ డ్రోన్లతోనే పాక్​ భారత్​పై దాడి చేసిందని రక్షణ శాఖ అధికారులు సైతం వెల్లడించారు. అయితే ఆ డ్రోన్లను భారత గగనతల రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మధ్యలోనే వాటిని పేల్చేసింది.

Boycott Turkey | సోషల్​ మీడియాలో ప్రచారం..

పాక్​కు మద్దతు తెలిపినందుకు టర్కిష్ ఆపిల్‌లను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు పూణేలోని యాపిల్ వ్యాపారులు తెలిపారు. టర్కీ యాపిళ్లు ఇక్కడ మూడు నెలల పాటు అమ్ముడవుతాయని, దాదాపు రూ. 1200 నుంచి రూ.1500 కోట్ల వ్యాపారం సాగుతుందని పేర్కొన్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో టర్కీ యాపిళ్లను బ్యాన్​ చేసినట్లు ప్రకటించారు. టర్కీలో భూకంపం వచ్చినప్పుడు, వారికి మనం సాయం చేశామని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఆ దేశం వారు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చిందన్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ఇప్పటికే భారత ప్రజలు టర్కీకిపై విరుచుకుపడుతున్నారు. బాయ్​కాట్​ టర్కీ అంటూ సోషల్​ మీడియాలో పోస్ట్​లు పెడుతున్నారు. ఆ దేశ వస్తువులను దిగుమతి చేసుకోద్దని, ఆ దేశానికి టూర్లకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే భారత ట్రావెల్​ బ్రాండ్​ గో హోమ్​ స్టేస్​ టర్కీష్​ ఎయిర్​లైన్స్​తో తన ఒప్పందాన్ని ముగించింది.