Maoists | మావోయిస్ట్​ పార్టీకి షాక్​.. భారీగా లొంగిపోనున్న నక్సల్స్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్ట్​ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్​కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన పార్టీకి మరో షాక్​ తగిలింది. భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం.మావోయిస్ట్ కీలక నేతలు తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు మధ్యాహ్నం డీజీపీ శివధర్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్ట్​ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ కీలక నేత మాడ్వి హిడ్మా (Madvi Hidma) ఇటీవల ఎన్​కౌంటర్​లో మృతి చెందిన విషయం తెలిసిందే. హిడ్మా ఎన్​కౌంటర్తో ఇప్పటికే భారీగా నష్టపోయిన పార్టీకి మరో షాక్​ తగిలింది.

భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోతున్నట్లు సమాచారం.మావోయిస్ట్ కీలక నేతలు తెలంగాణ పోలీసుల (Telangana Police) ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. ఈ మేరకు మధ్యాహ్నం డీజీపీ శివధర్​రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించనున్నారు. తాజాగా సరెండర్​ అయిన వారిలో టాప్​ కమాండర్లు ఉన్నట్లు సమాచారం. మొత్తం 37 మంది లొంగిపోయినట్లు తెలిసింది. సరెండర్​ అయిన వారిలో పార్టీ కీలక నేతలు అజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు లొంగిపోవడంతో తెలంగాణలో మావోయిస్ట్​ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది.

Maoists | ఆపరేషన్​ కగార్​తో..

దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం (Central Government) ప్రకటించింది. ఈ మేరకు ఆపరేషన్​ కగార్​ ప్రారంభించింది. దీంతో వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతున్నాయి. డ్రోన్​లు, ఆధునిక సాంకేతికత, పక్కా సమాచారంతో బలగాలు కూంబింగ్​ (Coombing) చేపడుతూ మావోయిస్టుల ఆట కట్టిస్తున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్​కౌంటర్లలో వందలాది మంది నక్సల్స్​ మృతి చెందారు. ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్​కౌంటర్​ అనంతరం చాలా మంది లొంగుబాట పట్టారు. తాజాగా హిడ్మా, టెక్​ శంకర్​ మృతితో పార్టీ బలహీనంగా మారింది. దీంతో కీలక నేతలు సైతం అడువులను వీడాలని నిర్ణయించుకున్నారు.

Maoists | లొంగు‘బాట’

ఆపరేషన్​ కగార్​ (Operation Kagar)తో భారీ సంఖ్యలో కేడర్​తో పాటు అగ్ర నాయకులు హతం అవుతుండటంతో మావోయిస్టులు ఆయుధాలు వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు లొంగుబాట పట్టారు. ఇప్పటికే చాలా మంది సరెండర్​ అయ్యారు. ముఖ్యంగా అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్​రావు, ఆశన్న తమ అనుచరులతో లొంగిపోయారు. అయితే ఒక్కో రాష్ట్రంలో కొంతమంది మావోయిస్టులు లొంగిపోతుండటం గమనార్హం. మల్లోజుల (Mallojula) మహారాష్ట్ర ప్రభుత్వం ఎదుట సరెండర్​ అయ్యారు. ఆశన్న ఛత్తీస్​గఢ్​లో ఆయుధాలు వీడారు. తాజాగా కీలక నేతలు తెలంగాణలో లొంగిపోనున్నారు. ఇప్పటికే వీరు పోలీసుల ఎదుట లొంగిపోయారని, డీజీపీ మధ్యాహ్నం అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Related articles

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...