ePaper
More
    HomeతెలంగాణGuvvala Balaraju | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

    Guvvala Balaraju | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Guvvala Balaraju | బీఆర్​ఎస్​ పార్టీకి షాక్​ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్​ (Former MLA Guvvala Balaraj) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను సోమవారం బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​కు (KCR) పంపారు.

    గువ్వల బాలరాజ్​ గతంలో రెండు సార్లు బీఆర్​ఎస్​ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యేగా (Achampet MLA) గెలుపొందారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. చాలాకాలం పాటు ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

    గువ్వల బాలరాజ్​ బీఆర్​ఎస్​ నుంచి రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. 2009లో బీఆర్​ఎస్​ నుంచి నాగర్​ కర్నూల్​ ఎంపీగా (Nagar Kurnool MP) పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో అదే స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్​ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు.

    Guvvala Balaraju | బీజేపీలో చేరనున్న గువ్వల

    గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్​రావుతో (BJP state president Ramachandra Rao) భేటీ అయ్యారు. తాజాగా గులాబీ పార్టీకి రాజీనామ చేశారు.

    ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరుతారని సమాచారం. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్​ఎస్​ను వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న వారు కాషాయ కండూవా కప్పుకుంటారని తెలిసింది. స్థానిక ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడటం బీఆర్​ఎస్​కు నష్టం కలిగించే అవకాశం ఉంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra)విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    More like this