అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Anchor Shivajyothi | యాంకర్ శివజ్యోతికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు షాక్ ఇచ్చారు. ఇటీవల ఆమె శ్రీవారి ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగిన విషయం తెలిసిందే. దీంతో టీటీడీ ఆమె ఆధార్‌కార్డును బ్లాక్ చేసింది.
శివజ్యోతి (Anchor Shivajyothi)ఇటీవల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుంది. క్యూ లైన్లో ఉన్న సమయంలో భక్తులకు ఇచ్చే ప్రసాదాన్ని ఆమె తీసుకున్నారు. ప్రసాదం తీసుకోవడంపై ఆమె వీడియో తీశారు. తిరుపతి (Tirupati)లో కాస్ట్లీ ప్రసాదం అడ్డుకున్నామంటూ కామెంట్ చేశారు. రిచెస్ట్ బిచ్చగాళ్లం అని శివజ్యోతి వ్యాఖ్యలు చేశారు. ఆమె తీరుపై భక్తులు, హిందూ సంఘాల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ఉచితంగా ఇచ్చే స్వామి వారి ప్రసాదాన్ని అడుక్కోవడం అనడం, నవ్వుతూ కామెంట్ చేయడంపై మండిపడ్డాయి. భక్తులకు శివ జ్యోతి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి.
Anchor Shivajyothi | సారీ చెప్పినా..
భక్తులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంపై శివజ్యోతి వ్యాఖ్యలు చేయడంతో టీటీడీ సీరియస్‌గా తీసుకుంది. ఆమె క్షమాపణలు చెప్పినా.. చర్యలు చేపట్టింది. భవిష్యత్‌లో శ్రీవారి దర్శనం చేసుకునే వీలు లేకుండా ఆమె ఆధార్‌కార్డు (Aadhaar Card)ను బ్లాక్ చేసింది. కాగా తన వ్యాఖ్యలపై శివజ్యోతి బహిరంగ క్షమాపణ చెబుతూ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తప్పుగా మాట్లాడాను క్షమించమంటూ వేడుకున్నారు. తాను తప్పుడు ఉద్దేశంతో అనలేదని చెప్పుకొచ్చారు. తెలిసో తెలియకో అన్నట్లు పేర్కొన్నారు. తనను క్షమించమని విన్నవించారు. అయినా అధికారులు ఆమెకు షాక్ ఇచ్చారు. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.