అక్షరటుడే, వెబ్‌డెస్క్: Virat Kohli | విరాట్ కోహ్లీకి బెంగళూరు పోలీసులు(Bangalore Police) షాక్ ఇచ్చారు. క్రికెట్లో పరుగుల వరద పారించి ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ రెస్టారెంట్ అండ్ పబ్(Restaurant and Pub) వ్యాపారం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో వన్8 కమ్యూన్ పబ్ అండ్ రెస్టారెంట్‌ను కోహ్లీ నిర్వహిస్తున్నాడు. తాజాగా పోలీసులు ఈ పబ్‌పై కేసు నమోదు చేశారు. రెస్టారెంట్లో స్మోకింగ్ ఏరియా(Smoking Area) లేదని ‘కోట్పా’ చట్టం కింద కేసు పెట్టారు.
పోలీసులు పబ్‌లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. అయితే స్మోకింగ్ చేసే వారికి పబ్‌లో ప్రత్యేకంగా స్థలం కేటాయించలేదు. దీంతో పబ్‌లో పొగ తాగుతున్నారు. ఇది సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) నిబంధనలకు విరుద్ధం కావడంతో పోలీసులు కేసు నమోదు(Police case register) చేశారు. మరోవైపు కింగ్ కోహ్లీ ఈ ఐపీఎల్ సీజన్(IPL Season)లో పరుగుల వరద పారించాడు. ఆర్సీబీ జట్టు ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలనే కసితో ఉంది. 18 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ బెంగళూరుకు కప్పు అందించాలని కోహ్లీ కలలు కంటున్నాడు. ఈ మేరకు ఆ జట్టు ఆల్రెడీ ఐపీఎల్ ఫైనల్(IPL Final)కు దూసుకెళ్లింది. మంగళవారం ఆ జట్టు పంజాబ్(Punjab)తో ఫైనల్లో తల పడనుంది. కాగా క్వాలిఫైయర్ –1లో పంజాబ్ కింగ్స్ జట్టును చిత్తు చేసిన ఆర్సీబీ(RCB) ఊపు మీద ఉంది. మరోవైపు క్వాలిఫైయర్–2లో ముంబైని ఓడించిన పంజాబ్ సైతం ఈ సారి ఎలాగైనా కప్పు కొట్టాలని చూస్తోంది.