అక్షరటుడే, వెబ్‌డెస్క్ : America | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు (Donald Trump) షాక్ తగిలింది. మూడు ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అందులో భారత సంతతికి చెందిన ఇద్దరు ఉండడం గమనార్హం.
అమెరికాలోని (America) వర్జీనియా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా గజాలా హష్మీ గెలుపొందారు. న్యూయార్క్ మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో జోహ్రాన్ మమ్‌దానీ విజయం సాధించారు. న్యూయార్క్ మేయర్‌గా నెగ్గిన తొలి ముస్లిం వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. జనవరి 1న ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
America | హైదరాబాద్‌లో పుట్టి..
వర్జీనియా లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా గెలుపొందిన గజాలా హష్మీ హైదరాబాద్‌లో (Hyderabad) జన్మించారు. తొలి ముస్లిం గవర్నర్‌గా, దక్షిణ ఆసియా నుంచి ఎన్నికైన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించింది. 2019లో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె వర్జీనియా జనరల్ అసెంబ్లీ మెంబర్ ఎన్నికయ్యారు. హష్మీ 1964లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు జియా హష్మీ, తన్వీర్ హష్మీ. ఆమె బాల్యం నగరంలోని మలక్‌పేటలో సాగింది. హష్మీ తండ్రి ప్రొఫెసర్ జియా హష్మీ అమెరికాలో ఉద్యోగం చేస్తూ సెటిల్ కావడంతో ఆమె తన తల్లితో అక్కడికి వెళ్లిపోయారు. తాజాగా వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా (Virginia Lieutenant Governor) విజయం సాధించారు.
America | భారత మూలాలు
న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మమ్‌దానీ సైతం భారత మూలాలు ఉన్న వ్యక్తి కావడం గమనార్హం. ఆయన ఉగాండాలోని కంపాలాలో 1991న జన్మించారు. ఆయన తల్లి భారతీయ చిత్రనిర్మాత మీరా నాయర్. ఉగాండా నుంచి దక్షిణాఫ్రికాకు, ఆ తర్వాత న్యూయార్క్ (New York) నగరంలో హమ్దాని కుటుంబం స్థిరపడింది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఆయన బౌడోయిన్ కాలేజీ నుంచి ఆఫ్రికానా స్టడీస్‌లో డిగ్రీ చదివారు. గతంలో ట్రంప్‌పై సైతం విమర్శలు చేవారు. వర్జీనియా స్టేట్ గవర్నర్‌గా అబిగైల్ స్పాన్‌బర్గర్ గెలుపొందారు. రిపబ్లికన్ స్టేట్‌గా ఉన్న వర్జీనియాలో డెమొక్రాట్లు గెలుపొందడం గమనార్హం.
