HomeUncategorizedPrabhakar Rao | ప్ర‌భాక‌ర్‌రావుకు షాక్‌.. అమెరికాలో చుక్కెదురు

Prabhakar Rao | ప్ర‌భాక‌ర్‌రావుకు షాక్‌.. అమెరికాలో చుక్కెదురు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Prabhakar Rao | ఫోన్ ట్యాపింగ్ (Phone tapping) కేసులో కీలక సూత్రధారిగా ఉన్న స్పెష‌ల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుకు ఎదురుదెబ్బ తగిలింది.

రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ అమెరికా కోర్టులో ఆయ‌న వేసిన పిటిష‌న్ కొట్టివేత‌కు గురైంది. రాజకీయ కక్షలో భాగంగా తనపై కేసులు పెట్టారని, ఈ నేప‌థ్యంలో త‌న‌ను రాజ‌కీయ శ‌ర‌ణార్థిగా గుర్తించాలంటూ ప్ర‌భాక‌ర్‌రావు పిటిషన్ వేయ‌గా చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ఇప్పటికే జూన్ 20లోగా కోర్టులో హాజరు కావాలంటూ ప్రభాకర్ రావుకు పోలీసులు నోటీసులు (Police notices) జారీ చేశారు. ప్రభాకర్‌రావు పోలీసు విచారణకు హాజరు కానందున ఆయనను అప్రకటిత నేరస్తుడిగా ప్రకటించాలని సిట్(Sit) అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా.. అందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.

Prabhakar Rao | అమెరికా నుంచి ర‌ప్పించేందుకు య‌త్నం..

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడిగా ఉన్న ప్ర‌భాక‌ర్‌రావు అమెరికా(America)కు ప‌రారైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసును సీరియ‌స్‌గా తీసుకున్న ప్ర‌భుత్వం(Government).. ఎలాగైనా ఆయ‌న‌ను తిరిగి ర‌ప్పించేందుకు తీవ్రంగా య‌త్నిస్తోంది. ఈ నేప‌థ్యంలో నాంప‌ల్లి కోర్టు(Nampally Court)లో పిటిష‌న్ దాఖ‌లు చేయగా, జూన్ 20 లోగా దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు హైద‌రాబాద్‌(Hyderabad city)లోని ఆయన ఇంటి గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.

తమ ఎదుట 20వ తేదీలోగా హాజరు కాకపోతే అప్రకటిత నేరస్తుడిగా ప్రకటిస్తామని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. అలా ప్రకటిస్తే ప్రభాకర్ ఆస్తులను జప్తు చేసే అధికారం దర్యాప్తు సంస్థకు ఉంటుంది. మ‌రోవైపు, ప్ర‌భాక‌ర్‌రావును అమెరికా నుంచి ర‌ప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ (Homeland Security) ద్వారా ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించేందుకు య‌త్నిస్తున్నారు. ఆయ‌న‌ను విచారిస్తే కీలక అంశాలు బయటపడతాయని, ఫోన్ ట్యాపింగ్ చేయమ‌ని ఆదేశించిన‌ అప్ప‌టి రాజ‌కీయ బాస్‌ల పేర్లు కూడా బ‌య‌ట‌కు వ‌స్తాయ‌ని భావిస్తున్నారు.

Prabhakar Rao | మూసుకుపోయిన దారులు..

కేసుల భ‌యంతో ఇండియా(India)కు వ‌చ్చేందుకు వ‌ణుకుతున్న ప్రభాకర్ రావు అమెరికాలో రాజకీయ శరణార్థిగా తనను గుర్తించాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, రాజకీయ శరణార్థిగా గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం (US government) ఒప్పుకోలేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు న్యాయ‌ప‌ర‌మైన దారులన్నీ మూసుకుపోయాయి. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం ప్రభాకర్ రావు పాస్‌పోర్ట్‌(Prabhakar Rao passport)ను రద్దు చేసింది.

ఆయ‌న‌పై ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీసు interpoll red corner notice జారీ చేశారు. ప్ర‌భాక‌ర్‌రావును డిపోర్ట్ చేయాలని, అందుకు గ‌ల కార‌ణాల‌ను అమెరికా ప్రభుత్వానికి పోలీసులు గతంలోనే ఒక నివేదిక రూపంలో ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో ప్రభాకర్ రావు ఏ ప్రాంతంలో ఉన్నారనే విషయాన్ని అమెరికా ప్రభుత్వం గుర్తించి ఇండియాకు స‌మాచార‌మిచ్చిన‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను డిపోర్ట్ చేసే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

Must Read
Related News