ePaper
More
    HomeజాతీయంCab Services | ఓలా, ఉబర్​లకు షాక్​.. అలా అయితే కస్టమర్లకు డబ్బులు ఇవ్వాల్సిందే..!

    Cab Services | ఓలా, ఉబర్​లకు షాక్​.. అలా అయితే కస్టమర్లకు డబ్బులు ఇవ్వాల్సిందే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cab Services | మహారాష్ట్ర ప్రభుత్వం maharashtra ఓలా ola, ఉబర్ uber​, ర్యాపిడో rapido వంటి సంస్థలకు షాక్​ ఇచ్చింది. రైడ్​ క్యాన్సల్​ చేస్తే ఫైన్​ వేస్తామని తెలిపింది. అలాగే రైడ్​ బుక్​ చేసుకున్న కస్టమర్​ ఖాతాలో డబ్బు జమ అవుతాయని పేర్కొంది. ఓలా, ఉబర్ మరియు ర్యాపిడో సంస్థలను లక్ష్యంగా చేసుకుని అగ్రిగేటర్ క్యాబ్స్ పాలసీ agrigater cabs policy 2025ను మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.

    Cab Services | సుప్రీం ఆదేశాల మేరకు..

    సుప్రీంకోర్టు supreme court ఆదేశాల మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సుధీర్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలో మహారాష్ట్ర సర్కార్​ క్యాబ్​ సర్వీసెస్​పై కమిటీ వేసింది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. ప్రయాణికుల భద్రత, డ్రైవర్ జవాబుదారీతనం, ఛార్జీల పారదర్శకతను పెంపొందించడానికి ఈ కమిటీ పలు సూచనలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా పాలసీ తీసుకొచ్చింది.

    Cab Services | ప్రయాణికుల భద్రత కోసమే

    ప్రయాణికుల భద్రత కోసమే కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త పాలసీ ప్రకారం ర్యాపిడో, ఓలా, ఉబర్​ సంస్థల వాహనాలకు రియల్-టైమ్ GPS ట్రాకింగ్, అత్యవసర బటన్లు తప్పనిసరి ఏర్పాటు చేయాలి. డ్రైవర్లకు పోలీసు ధృవీకరణ ఉండాలి. మహిళా ప్రయాణికులు మహిళా డ్రైవర్లను, సహ ప్రయాణీకులను ఎంచుకోవచ్చు. అలాగే ప్రస్తుతం క్యాబ్​లలో రద్దీని బట్టి అధికంగా ఛార్జీ చేస్తున్నారు. దీనిని నివారించేందుకు ఎట్టి పరిస్థితుల్లో ఫీజు బేస్ ఛార్జీ కంటే 1.5 రెట్లకు మించొద్దని ఆదేశించింది.

    Cab Services | రైడ్​ క్యాన్సల్​ చేస్తే ఫైన్లు

    డ్రైవర్లు రైడ్​ను తిరస్కరించిన, రద్దు చేసినా ఫైన్​ వేస్తారు. సంబంధిత అమౌంట్​ ప్రయాణీకుల అకౌంట్​లో జమ చేస్తారు. డ్రైవర్​ రైడ్​ను క్యాన్సల్​ చేస్తే రూ.వంద లేదా.. ప్రయాణ ఛార్జీలో పది శాతం( ఏది తక్కువైతే అది) జరిమానా వేస్తారు. ఈ జరిమానా మొత్తం ప్రయాణికుడి ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళా ప్రయాణికుడు రైడ్​ క్యాన్సల్ చేస్తే రూ.50 లేదా.. ఫేర్​ ఛార్జీలో 50 శాతం( ఏది తక్కువైతే అది) ఫైన్​ వేస్తారు. సంబంధిత అమౌంట్​ డ్రైవర్​ అకౌంట్​లో జమ అవుతంది.

    Cab Services | డ్రైవర్ల సాధికారత కోసం..

    కొత్త పాలసీలో డ్రైవర్ల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం పలు అంశాలు పొందుపరిచింది. ముఖ్యంగా బాగాలేని వాహనాలను తొలగించనున్నారు. అంతేగాకుండా డ్రైవర్​ ప్రతి రైడ్​ నుంచి కనీసం 80శాతం ఛార్జీని పొందాలి. ప్రస్తుతం కమీషన్​ ఎక్కువ తీసుకుంటున్న కంపెనీలు డ్రైవర్లకు అరకొరగా ఛార్జీలు చెల్లిస్తున్నాయి. డ్రైవర్లకు శిక్షణ ఇప్పించడంతో ఆయా సంస్థలు బీమా కల్పించాలి.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...