HomeతెలంగాణMaoists | మావోయిస్టులకు షాక్​.. ఇద్దరు కీలక నేతల లొంగుబాటు

Maoists | మావోయిస్టులకు షాక్​.. ఇద్దరు కీలక నేతల లొంగుబాటు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులకు మరో షాక్ తగిలింది. ఇద్దరు కీలక నేతలు గురువారం హైదరాబాద్​లో రాచకొండ సీపీ సుధీర్​బాబు ఎందుట లొంగిపోయారు.

దేశంలో 2026 మార్చి వరకు మావోయిస్టులు లేకుండా చేస్తామని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు భద్రతా బలగాలు ఆపరేషన్​ కగార్ (Operation Kagar)​ చేపట్టి అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్​లో భాగంగా వందలాది ఎన్​కౌంటర్లు (Encounters) చోటు చేసుకోగా చాలా మంది నక్సల్స్​ హతం అయ్యారు. కీలక నేతలు సైతం నేలకొరిగారు. ఆపరేషన్​ కగార్​ ధాటికి చాలా మావోయిస్టులు లొంగిపోయారు. అయితే ఇటీవల వర్షాల నేపథ్యంలో ఎన్​కౌంటర్లు చోటు చేసుకోవడం లేదు. భద్రతా బలగాలు (Security Forces) అడవుల్లో కూంబింగ్​ చేపట్టకపోవడంతో మావోలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తాజాగా ఇద్దరు కీలక నేతలు లొంగిపోవడంతో వారు కలవర పడుతున్నారు.

Maoists | రాష్ట్ర కమిటీ సభ్యురాలు

తెలంగాణలో (Telangana) ఇద్దరు మావోయిస్టుల గురువారం లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ మెంబర్ కాకరాల సునీత అలియాస్ బద్రి (62), చెన్నూరు హరీష్ (35) రాచకొండ సీపీ (Rachakonda CP) ఎదుట సరెండర్​ అయ్యారు. కాగా సునీతపై కోటి రూపాయల రివార్డ్ ఉంది. సునీత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ భార్య కావడం గమనార్హం. పార్టీ సిద్ధాంతాల రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు. పార్టీ పత్రిక జంగ్ క్రాంతికి ఎడిటర్‌గా సైతం పని చేశారు. వైఎస్​ రాజశేఖరరెడ్డి (YSR) హయాంలో జరిగిన శాంతి చర్చల ప్రక్రియలోనూ కీలక పాత్ర పోషించారు. విప్లవ రచయితల సంఘం నేత కాకర్ల సత్యనారాయణ కుమార్తె అయిన సునీత ఇప్పటి వరకు ఐదు ప్రధాన ఎన్​కౌంటర్లలో పాల్గొంది. తాజాగా ఆమె లొంగిపోవడం మావోలకు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.

Maoists | 40 ఏళ్లు ఉద్యమంలో..

సునీత దాదాపు నాలుగు దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్నారు. 1986లో అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిన సునీత మావోయిస్టు భావజాలాన్ని అందించడంలో, పార్టీ వ్యూహాలను రూపొందించడంలో కీలకంగా వ్యవహరించారు. 2025 జూన్​లో జరిగిన అన్నపురం నేషనల్ పార్క్ (National Park) ఎన్‌కౌంటర్ ఆమె భర్త చనిపోయారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన మావోయిస్టులు లొంగిపోవాలని సూచించారు. తమ గ్రామాలకు వెళ్లి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నారు.