అక్షరటుడే, వెబ్‌డెస్క్: Bonalu Festival | హైదరాబాద్ నగరంలో (Hyderabad City) బోనాల పండుగ ఘనంగా జరుగుతోంది. గోల్కొండ జగదాంబిక అమ్మవారి (Golconda Jagadambika Ammavari) బోనాలతో పండుగ ప్రారంభమైన విషయం తెలిసిందే. గత వారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా నిర్వహించారు.
ఆదివారం నగరంలోని పలు ప్రాంతాల్లో బోనాల పండుగ జరగనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం దుకాణాలు మూసి వేయాలని సీపీ సుధీర్‌బాబు (CP Sudheer Babu) ఉత్తర్వులు జారీ చేశారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి సోమవారం ఉదయం ఆరు గంటల వరకు వైన్ షాపులు మూసి ఉంచాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నగరంలోని లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి ఆలయం, నాచారం మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి దేవస్థానం, కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయం, ఛార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంతో పాటు చాలా ఆలయాల్లో ఆదివారం బోనాల పండుగ (Bonala festival) నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆయా ఆలయాల్లో ఇబ్బందులు తతెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టారు. మొత్తం 17 ఆలయాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.