అక్షరటుడే, కామారెడ్డి : Shobha Yatra : కామారెడ్డి పట్టణంలో గణేష్ శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. ఆనవాయితీ ప్రకారం ధర్మశాల వద్ద రైల్వే స్టేషన్ యువజన సమాఖ్య గణపతికి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర కొబ్బరికాయ కొట్టి శోభయాత్రను లాంఛనంగా ప్రారంభించారు.

జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర డ్రోన్ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. శోభయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పీ చైతన్య రెడ్డి, డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.

Shobha Yatra : ఆకట్టుకున్న గణపతులు
శోభాయాత్ర సందర్భంగా వివిధ వినాయకులను ప్రత్యేకంగా అలంకరించారు. ఆజాద్ హిందు గణపతి Azad Hindu Ganapati ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

రైతాంగాన్ని ప్రోత్సహిస్తూ పొద్దున్నే లేచి పొలం బాట పట్టి ఆరుగాలం శ్రమించి ఆకలి తీర్చే వాడు రైతు అనే క్యాప్షన్ వచ్చేలా ఎడ్ల బండిపై గణపతి ఉండటంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

శోభయాత్రను తిలకించడానికి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. విశ్వ హిందుపరిషత్, గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలువురు చిన్నారులు ఇచ్చిన నృత్య ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయి.

Shobha Yatra : భారీ బాందోబస్తు
శోభాయాత్ర సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అడుగడుగునా పోలీసులను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్ ముందు పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేశారు.

ఎస్పీ సహా ఇతర అధికారులు ఔట్ పోస్టు నుంచి బందోబస్తును పర్యవేక్షించనున్నారు. పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు అందజేశారు.
