Homeక్రీడలుShoaib Malik | సానియా మాజీ భ‌ర్త రెండో పెళ్లి కూడా పెటాకులైందా.. మీడియాలో జోరుగా...

Shoaib Malik | సానియా మాజీ భ‌ర్త రెండో పెళ్లి కూడా పెటాకులైందా.. మీడియాలో జోరుగా వార్త‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shoaib Malik | పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా(Sania Mirza) మాజీ భర్తగా గుర్తింపు పొందిన విష‌యం తెలిసిందే. అయితే ఆయన, మరోసారి వ్యక్తిగత జీవితానికి సంబంధించి వార్తల్లో నిలిచాడు.

2010లో సానియాతో వివాహం చేసుకోగా, వారి దాంప‌త్య‌జీవితంలో షోయబ్(Shoaib Malik), సానియాల‌కి ఓ కుమారుడు (ఇజాన్) జ‌న్మించారు. 14 సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి హ్యాపీ మెరేడ్ లైఫ్ గడిపారు. అయితే 2024లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత షోయబ్ మాలిక్ పాక్ నటి సనా జావేద్‌ను జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు.అప్పటి నుంచి షోయబ్-సనా జంట కలిసి పలు ఈవెంట్స్‌కు హాజరవుతూ, సోషల్ మీడియాలో కలిసి ఫోటోలు పోస్ట్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు.

 Shoaib Malik | డైవ‌ర్స్ ఖాయమా..

కానీ తాజాగా ఈ జంట మధ్య విభేదాలు తలెత్తినట్లు పలు వార్తలు వెలువడుతున్నాయి. ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఓ పబ్లిక్ ఈవెంట్‌ సందర్భంగా షోయబ్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తుండగా, సనా ఆ సమయంలో కోపంగా ముఖం తిప్పుకుంది. అదే కార్యక్రమంలో ఒకే సోఫాలో కూర్చున్నా ఇద్దరూ పరస్పరం మాట్లాడుకోకపోవడం, చిరాకు వ్యక్తం చేయడం ద్వారా ఈ విడాకుల వార్తలకు బలం చేకూరింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే పలు పాకిస్థాన్(Pakistan) జాతీయ మీడియా సంస్థలు వీరి విడాకులు ఖాయమని కథనాలు ప్రచురించాయి. మరి కొద్ది రోజుల్లోనే వీరిద్దరూ విడాకుల ప్రకటన చేసే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. షోయబ్‌కు ఇది రెండో వివాహమైతే, సనా జావేద్‌కు కూడా ఇది రెండో పెళ్లే. సనా 2020లో సింగర్ ఉమైర్ జస్వాల్‌ను పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడిపోయింది. ఆ తర్వాత ఆమె షోయబ్‌ను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఈ బంధం కూడా ఎక్కువకాలం నిలవలేదన్న అనుమానాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. అయితే, వీరి విడాకుల వార్తలపై ఇప్పటివరకు షోయబ్ మాలిక్ కానీ, సనా జావేద్ కానీ అధికారికంగా స్పందించలేదు.