అక్షరటుడే, వెబ్‌డెస్క్: DGP Shivadhar Reddy | తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత డీజీపీ జితేందర్ (DGP Jitender) పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. సీనియారిటీలో ఆయన కన్నా ముందు వేరే వారు ఉన్నా ప్రభుత్వం శివధర్ రెడ్డికి అవకాశం కల్పించింది. అందరూ ఊహిస్తున్నట్లుగానే రెడ్డి సామాజిక వర్గానికి పెద్దపీట వేసింది. వచ్చే ఏడాది వరకూ పదవీ కాలం ఉన్న నేపథ్యంలో డీజీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
DGP Shivadhar Reddy | రంగారెడ్డి జిల్లా వాసి..
సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి (Senior IPS officer Shivdhar Reddy) తెలంగాణకు చెందిన వ్యక్తి. రంగారెడ్డి జిల్లా (Rangareddy district) ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన ఆయన.. ఉన్నత విద్య వరకు హైరదాబాద్‌లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేశారు. 1994 ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన వివిధ హోదాల్లో విశేష సేవలు అందించారు. గ్రౌహౌండ్స్ స్క్వాడ్రన్ లీడర్ గా పని చేశారు. ఆదిలాబాద్, నల్గొండ, గుంటూరు తదితర జిల్లాలకు ఎస్పీగా, విశాఖ పోలీసు కమిషనర్‌గా (Visakhapatnam Police Commissioner) వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏసీబీ డైరెక్టర్‌గా పని చేశారు. 2023 నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేస్తున్నారు.
DGP Shivadhar Reddy | నయీం ఎన్కౌంటర్ ప్లాన్
డీజీపీగా నియామకమైన శివధర్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఓయూ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆయన కొంతకాలం న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి ఐపీఎస్ అయ్యారు. జిల్లాల ఎస్పీగా, డీఐజీ ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014-2016 మధ్య తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా పనిచేశారు. 2016 నయీం ఎన్కౌంటర్ (Nayeem Encounter) ఆపరేషన్ ఆయనే ప్లాన్ చేశారు.