అక్షరటుడే, ఇందూరు : Shivaji Jayanti Blood Donation | ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని నగరంలోని బోర్గాం(పి) వద్ద డీసీబీ బ్యాంకు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. నగరపాలక సంస్థ బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, 6వ డివిజన్ కార్పొరేటర్ స్రవంతి రెడ్డి (Corporator Sravanthi Reddy), 22వ డివిజన్ కార్పొరేటర్ పుల్గం వైష్ణవి పాల్గొని శివాజీ మహరాజ్ విగ్రహానికి (Shivaji Maharaj Statue) పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహరాజ్ గొప్ప పోరాట యోధుడు అని కొనియాడారు. తన యుద్ధ తంత్రాలతో దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో ఎంతో కృషి చేశారన్నారు. భారతీయ సామాజిక ముఖచిత్రాన్ని మార్చిన ఓ గొప్ప విప్లవకారుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో డీసీబీ బ్యాంకు సిబ్బంది ఆర్హెచ్ అనిల్ రెడ్డి, సీబీహెచ్ శివకుమార్, డీబీఎం ప్రవీణ్, ఆర్ఎం శ్రీకాంత్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.