అక్షరటుడే, ఇందూరు: Shivaji Jayanti Annadanam | నగరంలోని (Nizamabad City) వినాయక్‌నగర్ హనుమాన్ జంక్షన్ (Vinayaknagar Hanuman Junction) వద్ద ఛత్రపతి శంభాజీ మహరాజ్ యువసేన (Chhatrapati Shambhaji Maharaj Yuva Sena) ఆధ్వర్యంలో శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువసేన ఆధ్వర్యంలో భారీ అన్నదానం నిర్వహించారు.
Shivaji Jayanti Annadanam | హిందుత్వం బలపడేందుకు ఎంతో కృషి..
ఈ సందర్భంగా ఛత్రపతి శంభాజీ మహరాజ్ యువసేన అధ్యక్షుడు కౌటన్య ముత్యం గౌడ్ మాట్లాడుతూ శివాజీ హైందవ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయం అని కొనియాడారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఛత్రపతి శంభాజీ యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 4వ టౌన్ ఎస్సై సందీప్, పోలీసు సిబ్బంది హాజరై అన్నప్రసాద వితరణ చేశారు.
అనంతరం ఎస్సై సందీప్ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా రత్నాకర్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, దర్శనం సురేష్, యువసేన బృందం సభ్యులు ముత్యాల సురేష్, బంగారి నవీన్, రేకోటి శివకుమార్(బిట్టు), మెట్టుగంగాధర్, చందు రాథోడ్, నీరజ్, సాయికుమార్, నవీన్ కుమార్, నితిన్ పటేల్, క్రాంతి కుమార్, కొత్త భరత్ పటేల్, అక్షిత్ గౌడ్, నాగార్జున, ఉదయ్, ముత్యం, చోటు తదితరులు పాల్గొన్నారు.
