ePaper
More
    HomeసినిమాJunior | వైర‌ల్ వ‌య్యారి పాట‌కు శ్రీలీలతో క‌లిసి డ్యాన్స్ చేసిన శివ‌రాజ్‌కుమార్

    Junior | వైర‌ల్ వ‌య్యారి పాట‌కు శ్రీలీలతో క‌లిసి డ్యాన్స్ చేసిన శివ‌రాజ్‌కుమార్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Junior : ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన రెడ్డి Gali Janardhana Reddy కుమారుడు కిరీటి కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘జూనియర్’ విడుదలకు సిద్ధమైంది. కన్నడ Kannada, తెలుగు Telugu, తమిళ Tamil భాషల్లో ఒకేసారి విడుదలకానున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు కారణం ఇందులో స్టార్ నటీనటులు, టెక్నికల్ క్రూ, మాస్-అపీలింగ్ కంటెంట్ ఉండ‌టం ముఖ్య కార‌ణంగా చెప్ప‌వ‌చ్చు.

    ఈ సినిమాలో కిరీటి సరసన టాలీవుడ్ Tollywood లేటెస్ట్ క్రష్ శ్రీలీల Srileela కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో, రీసెంట్‌గా రిలీజ్ అయిన రెండో పాట ‘వైరల్ వయ్యారి నేనే వయసొచ్చిన అణుబాంబును’ అంటూ సాగే మాస్ మ్యూజికల్ నెటిజన్లను ఊపేస్తోంది.

    Junior : డ్యాన్స్ అదిరింది..

    ఈ పాటకు పవన్ భట్ Pawan Bhatt సాహిత్యం అందించగా.. హరిప్రియ, దీపక్ బ్లూ ఆలపించారు. సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్ Devi Sri prasad (DSP) తన ఎనర్జిటిక్ మ్యూజిక్‌తో మరోసారి హిట్ గ్యారెంటీ ఇచ్చాడు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ పాట యూట్యూబ్‌లో ఇప్పుడు మిలియన్ల వ్యూస్‌ను సాధిస్తోంది. ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి 6 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి.

    శ్రీలీల ఎనర్జిటిక్ డాన్స్ మూమెంట్స్‌కి కిరీటి కూడా తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. పాటలో వారి కెమిస్ట్రీ, స్క్రీన్ ప్రెజెన్స్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బెంగ‌ళూరులో జ‌ర‌గ‌గా, ఈ పాట‌కి శ్రీలీల‌, కిరిటీతో పాటు క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ Kannada star hero Shivaraj Kumar కూడా చిందులు వేయ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంతేకాదు వారి డ్యాన్స్ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తోంది.

    ఈ చిత్రాన్ని ‘మాయాబజార్’ ఫేమ్ రాధాకృష్ణ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. సీనియర్ నటులు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కూడా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘బాహుబలి’, ‘RRR’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ ఈ సినిమాకి విజువల్ మ్యాజిక్ అందిస్తుండగా, యాక్షన్ సీన్స్‌కి పీటర్ హెయిన్స్ నేతృత్వం వహిస్తున్నారు.

    ఇతర భాషల ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాలనే లక్ష్యంతో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ జులై 18న థియేటర్లలోకి రానుంది. ‘వైరల్ వయ్యారి’ Viral Vaiyaari సాంగ్ సక్సెస్‌తో ‘జూనియర్’పై హైప్ మరింత పెరిగింది. అభిమానులు ఇప్పుడు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    More like this

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...