HomeUncategorizedShining Star Awards | ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్ధుల‌ను ప్రోత్స‌హిస్తున్న ఏపీ ప్ర‌భుత్వం.. షైనింగ్...

Shining Star Awards | ఉత్త‌మ ఫ‌లితాలు సాధించిన విద్యార్ధుల‌ను ప్రోత్స‌హిస్తున్న ఏపీ ప్ర‌భుత్వం.. షైనింగ్ స్టార్స్ పేరుతో అవార్డులు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Shining Star Awards | ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం AP Govt ఓ స్ఫూర్తిదాయక నిర్ణయం తీసుకుంది. టెన్త్ (SSC) మరియు ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్స్’ పేరిట ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించేందుకు కొత్త అడుగు వేసింది. 2024–25 విద్యా సంవత్సరం నుంచి ‘షైనింగ్ స్టార్స్’ అవార్డులను ప్రారంభించనుంది. ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి షైనింగ్ స్టార్స్ అవార్డులు ఇవ్వానుంది ఏపీ ప్ర‌భుత్వం.

Shining Star Awards | మండలాల వారీగా అవార్డులు

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కోన శశిధర్(Kona Shashidhar) తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. విద్యా వ్యవస్థలో నాణ్యత, ప్రమాణాలు పెంచేందుకు అవార్డులు Awards ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ నెల 9న అన్ని జిల్లా కేంద్రాల్లో అవార్డులు ప్రదానం చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పదో తరగతిలో 500 మార్కులు లేదా 83.33 శాతం, ఆపైన అత్యధిక మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు మండలాల వారీగా ఎంపిక చేసి అవార్డులు ఇస్తారు. ఇంటర్​లో 830 మార్కుల పైన అధిక మార్కులు సాధించిన ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు జిల్లాల వారీగా ఎంపిక చేసి అవార్డులు ఇవ్వనున్నారు.

ప్రతి జిల్లాకు 36 మందిని ఎంపిక చేస్తారు. ప్రతి మండలంలో అత్యధిక మార్కులు(Highest marks) సాధించిన మొత్తం ఆరుగురు పదో తరగతి విద్యార్థులకు అవార్డులు ఇవ్వ‌నున్న‌ట్టు తెలియ‌జేశారు. ప్రతి మండలంలో ఇద్దరు ఓసీ , ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ విద్యార్థులను ఎంపిక చేస్తారు. అవార్డుకు ఎంపికైన పది, ఇంటర్ విద్యార్థులకు Inter Students సర్టిఫికెట్, మెడల్​తో పాటు 20 వేల నగదు ప్రోత్సహకం అందించి సన్మానించనున్నారు. రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాల్లో మొత్తం 81.14 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 93.90 శాతం ఉత్తీర్ణతతో అగ్రస్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా నిలవగా 47.64 శాతం ఉత్తీర్ణతతో ఆలూరి సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచింది.