ePaper
More
    HomeజాతీయంStreet Dogs | వీధి కుక్కలపై మున్సిపాలిటీ కొత్త పద్ధతి .. క్యూఆర్ కోడ్, జీపీఎస్...

    Street Dogs | వీధి కుక్కలపై మున్సిపాలిటీ కొత్త పద్ధతి .. క్యూఆర్ కోడ్, జీపీఎస్ ట్యాగ్‌లు అమర్చనున్నారా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Street Dogs | సిమ్లాలో వీధి కుక్కల బెడద రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటి నుంచి ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తీవ్రంగా బాధపడుతున్నారు.

    ఈ నేపథ్యంలో వీధి శునకాల నియంత్రణకు సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌ (Shimla Municipal Corporation) కొత్త ఆలోచనను అమలులోకి తేనుంది. త్వరలో నగరంలోని వీధి కుక్కల మెడకు క్యూఆర్ కోడ్, జీపీఎస్ ట్యాగ్‌లను అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ట్యాగింగ్ సిస్టమ్‌ ద్వారా ప్రతి కుక్కకు ప్రత్యేక గుర్తింపు నంబర్‌తో కూడిన క్యూఆర్ కోడ్‌ (QR Code)ను జారీ చేస్తారు. దీంతో వాటి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ వివరాలు అన్నీ డేటాబేస్‌లో నమోదు చేస్తారు.

    Street Dogs | స్మార్ట్ ట్యాగింగ్‌తో శునకాల ట్రాకింగ్

    జీపీఎస్(GPS) సహాయంతో శునకాల లొకేష‌న్‌ (Dogs Location)ని గుర్తించి, అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా కుక్కల గుంపులు ఏ ఏ ప్రాంతాల్లో తిరుగుతున్నాయో తెలుసుకోవ‌చ్చు. అలానే ప్రజలకు ముప్పుగా మారే పరిస్థితి ఉంటే ముందుగానే చర్యలు తీసుకోవచ్చు. వీధుల్లో తిరిగే శునకాలు చిన్నారులను వెంబడించడం, కరిచే ఘటనలు రోజు రోజుకు పెరిగిపోవడం, కొన్ని తీవ్ర దాడులకు పాల్పడడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో సిమ్లా మున్సిపల్ కార్పొరేషన్‌ తీసుకున్న తాజా నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు.

    ఇటీవలి కాలంలో వీధి కుక్కల (Street Dogs) దాడుల తీవ్రతపై లాన్సెట్ ఇన్‌ఫెక్షస్ డిసీజ్ నివేదిక ఘాటుగా స్పందించింది. దేశంలో జంతువుల దాడుల్లో 75 శాతం కుక్కల ద్వారానే జరుగుతున్నట్లు వెల్లడించింది. దేశంలో నిత్యం ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడులకు గురవుతున్నారు. రేబిస్ (Rabis Diseases) లాంటి ప్రాణాంతక వ్యాధులతో సంబంధం ఉన్న ఈ దాడుల వల్ల ఏటా సుమారు 5,700 మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు అంచనా. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సిమ్లా మున్సిపాలిటీ చేపట్టిన స్మార్ట్ ట్యాగింగ్ చర్యను ఇతర నగరాలూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సమస్య తలెత్తిన తర్వాత ఉరుకులు ప‌రుగులు పెట్ట‌డం క‌న్నా ముందుగానే పక్కా పద్ధతిలో సమర్థవంతంగా శునకాల నియంత్రణకు చర్యలు తీసుకోవడమే దీర్ఘకాలిక పరిష్కార మార్గం అని పౌరసంఘాలు చెబుతున్నాయి.

    Latest articles

    CI Narahari | మానవత్వం చాటుకున్న సీఐ నరహరి, మున్సిపల్​ మాజీ ఛైర్​పర్సన్​ ఇందుప్రియ

    అక్షరటుడే, కామారెడ్డి : CI Narahari | పట్టణ సీఐ నరహరి మానవత్వం చాటుకున్నారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని...

    BC Sankshema Sangham | బహుజన వీరుడు సర్దార్ పాపన్న గౌడ్

    అక్షరటుడే, ఇందూరు: BC Sankshema Sangham | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sardar Sarvai Papanna Goud)...

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేనా.. ప్రయత్నాలు ప్రారంభించిన ఎన్డీఏ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అధికార ఎన్డీఏ కూటమి భావిస్తోంది. జగదీప్​...

    Raktha Veera Award | రేపు జాతీయ రక్త వీర అవార్డు అందుకోనున్న వెంకటరమణ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Raktha Veera Award | రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేసి సేవ చేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు...

    More like this