అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Shilpa Shirodkar | ఒకప్పుడు బాలీవుడ్‌లో ప్రముఖ కథానాయికగా వెలిగిన శిల్పా శిరోద్కర్‌కి చెందిన కారును బస్సు ఢీకొట్టిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటన ముంబైలోని అంధేరి ప్రాంతంలో చోటుచేసుకుంది. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి ఉన్న మెర్సిడెస్ బెంజ్ కారు(Mercedes Benz car)ను, వెనుక నుంచి వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ, ప్రమాద సమయంలో శిల్పా కారులో లేనందున పెద్ద ప్రమాదం తప్పింది. శిల్పా కారును ఆమె డ్రైవర్ నడుపుతుండగా, ట్రాఫిక్ సిగ్నల్(Traffic Signal) వద్ద ఆగిన క్షణంలో వెనుక నుంచి అదుపుతప్పిన బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
Shilpa Shirodkar | పెద్ద ప్రమాదం తప్పింది..
కారు వెనుకభాగం పూర్తిగా దెబ్బతింది. బాధితులను ముందుజాగ్రత్త చర్యగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన శిల్పా శిరోద్కర్(Shilpa Shirodkar), తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు డ్రైవర్ ఏ ధ్యాసలో ఉన్నాడో. బహుశా ఫోన్‌లో మాట్లాడుతూ ఉండొచ్చు. నా కారు సిగ్నల్ దగ్గర స్పష్టంగా కనిపిస్తూ ఉన్నా ఇలా ఢీకొట్టడం వింతగా ఉంది. దేవుడి దయవల్ల అందరికీ ప్రమాదం తప్పింది అంటూ ఆమె పేర్కొన్నారు. ప్రమాదంపై వెర్సోవా పోలీస్ స్టేషన్(Versova Police Station)లో ఫిర్యాదు నమోదైంది. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, డ్రైవర్ స్టేట్‌మెంట్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం జరగకపోవడం పెద్ద ఊరటగా మారింది. శిల్పా శిరోద్కర్ మాత్రం ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకొని షాక్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది. సిటీ ఫ్లో అనే కంపెనీకి చెందిన బస్సు ..శిల్పా కారుని ఢీకొట్టినట్టు తెలుస్తుండగా, సంస్థకు చెందిన యోగేష్ కదమ్, విలాస్ మంకోటే అనే ప్రతినిధులను శిల్పా శిరోద్కర్ సంప్రదించినట్టు సమాచారం. అయితే అది తమ కంపెనీ బాధ్యత కాదని, డ్రైవర్‌దే పూర్తి బాధ్యత అని చెప్పారట. వారి మాటలని బట్టి కంపెనీ ఉద్యోగుల పట్ల వారు ఎలా నిర్లక్ష్యంగా ఉన్నారు, డ్రైవర్‌కి నెల జీతం ఎంత వస్తుంది, అంత డ్యామేజ్ ఎలా భరిస్తాడు అంటూ శిల్పా శిరోద్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కంపెనీ ఎలాంటి బాధ్యతను తీసుకోవడానికి నిరాకరించడం దారుణం అంటూ శిల్పా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.