Shikhar Dhawan Second Marriage | సోఫీతో శిఖర్ ధావన్ రెండో వివాహం.. ఢిల్లీలో గోప్యంగా జ‌రిగిన పెళ్లి వేడుక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shikhar Dhawan Second Marriage | టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీని ఢిల్లీ (Delhi) ఎన్‌సీఆర్ ప్రాంతంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖ‌ర్ ధావ‌న్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తన ప్రేయసి సోఫీతో శనివారం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో జరిగిన […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shikhar Dhawan Second Marriage | టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తన ప్రేయసి సోఫీని ఢిల్లీ (Delhi) ఎన్‌సీఆర్ ప్రాంతంలో కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయ‌న‌కు ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.

టీమిండియా మాజీ ఓపెనర్ శిఖ‌ర్ ధావ‌న్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. తన ప్రేయసి సోఫీతో శనివారం ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతంలో జరిగిన ప్రైవేట్ వేడుకలో వివాహ బంధంలో అడుగుపెట్టాడు. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రుల మధ్య ఈ పెళ్లి వేడుకను అత్యంత గోప్యంగా నిర్వహించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను చాహ‌ల్ (Yuzvendra Chahal) సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. అంతకుముందు తన సంగీత్ నైట్ ఫొటోలను ధావన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

Shikhar Dhawan Second Marriage | జనవరిలో నిశ్చితార్థం

ధావన్–సోఫీ జంట ఈ ఏడాది జనవరిలో తమ నిశ్చితార్థాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 2025లో వీరి ప్రేమ వ్యవహారం బహిర్గతమైంది. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా దుబాయ్‌లో తొలిసారి ఇద్దరూ కలిసి కనిపించడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కాగా, సోఫీ ఐర్లాండ్‌లో చదువుకుని మార్కెటింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం అబుదాబీలోని Northern Trust Corporationలో సెకండ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా, శిఖర్ ధావన్ ఫౌండేషన్‌కు సంబంధించిన సేవా కార్యక్రమాలను కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షలాది ఫాలోవర్లు ఉన్న సోఫీ, ధావన్‌తో కలిసి పలు మ్యాచ్‌లకు హాజరవుతూ అభిమానులను ఆకట్టుకున్నారు.

ధావన్ గతంలో అయేషా ముఖ‌ర్జీని Aesha Mukerji వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అయితే 2023లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు సోఫీతో వివాహం చేసుకోవడంతో ధావన్ తన జీవితంలో కొత్త అధ్యాయం ఆరంభించాడు. అభిమానులు, క్రికెట్ ప్రపంచం నుంచి ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శిఖ‌ర్ ధావన్ భారత జట్టుకు మూడు ఫార్మాట్లలో కలిపి 269 మ్యాచ్‌లు ఆడాడు. 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20ల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. 2010లో వన్డే అరంగేట్రం చేసిన ధావన్, 2013లో టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చి 2018లో ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. టీ20ల్లో 2011లో అరంగేట్రం చేసి 2021లో చివరి మ్యాచ్ ఆడాడు. ఆగస్టు 24, 2024న అంతర్జాతీయ, దేశీయ క్రికెట్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించిన గబ్బర్, ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.

Srinivas kolluri
Srinivas kollurihttps://www.aksharatoday.in/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తాను.

Related articles

Gurugram live-in attack | పెళ్లి చేసుకోమ‌న్నందుకు దారుణం.. యువతిపై శానిటైజర్ పోసి నిప్పంటించిన ప్రియుడు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gurugram live-in attack | హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో దగ్గరై...

Telangana Rain Alert | ఉరుములతో కూడిన వర్ష సూచన

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rain Alert | నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని (Telugu States)...

Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. లొంగిపోయిన దేవ్​జీ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoist Leader Devji Surrender | మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ అగ్ర నేతలు దేవ్​జీ,...

Delhi Terror Plot Busted | ఢిల్లీలో ఉగ్ర కుట్ర భగ్నం.. 8 మంది అరెస్ట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Delhi Terror Plot Busted | ఢిల్లీలో భారీ పేలుళ్లకు కుట్ర పన్నిన అంతర్జాతీయ ఉగ్ర నెట్‌వర్క్‌ను ఢిల్లీ పోలీసులు...