అక్షర టుడే, నిజాంసాగర్: Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో దిగువన మంజీర నదిలో (Manjira river) నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఇద్దరు గొర్రెల కాపర్లు, 30 వరకు గొర్రెలు నీటి ప్రవాహంలోనే చిక్కుకున్నారు.
మహమ్మద్ నగర్ మండలం (Mohammed Nagar mandal) ముగ్దుంపూర్‌కు చెందిన కాపర్లు అస్గర్ పాషా, బండారి సాయినాథ్ సోమవారం వరదనీటిలో చిక్కుకున్న విషయం తెలియడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ మేరకు బాన్సువాడ డీఎస్పీ విఠల్‌రెడ్డి, తహశీల్దార్ సవాయిసింగ్, నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ (Nizamsagar SI Shivakumar) సంఘటనా స్థలానికి చేరుకునారు. వరదలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రత్యేక బలగాలతో ప్రయత్నం ముమ్మరం చేశారు. నీటి ప్రవాహం తగ్గించేందుకు ప్రాజెక్టు గేట్లు మూసివేశారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు వారిని, గొర్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. స్థానికులు, గ్రామస్థులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. వారిని ఒడ్డుకు చేర్చిన అనంతరం ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల కొనసాగించారు.