330
అక్షరటుడే, బాన్సువాడ: Nizamsagar | నిజాంసాగర్ మండలం నడిమి తండా (Nadimi Thanda) ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాత పడ్డాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన రహదారిపై గొర్రెలు రోడ్డు దాటుతున్న సమయంలో (national highway) రోడ్డు పనులు నిర్వహిస్తున్న వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో నడిమి తండాకు చెందిన అమృకి చెందిన 12 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. ఈ ఘటనలో ఆర్థిక నష్టం వాటిల్లడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బాధితుడి నష్ట పరిహారం అందించాలని స్థానికులు కోరుతున్నారు.