అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Google | గూగుల్‌లో ఉద్యోగం చేయాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. అయితే కొందరికి మాత్రమే అవకాశం వస్తుంది. అలా ఓ మహిళ సైతం గతంలో గూగుల్ కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే రిజెక్ట్ చేశారు. కానీ ప్రస్తుతం ఆమెకు ఇండియా హెడ్‌గా బాధ్యతలు అప్పగించారు.
టెక్ దిగ్గజ సంస్థ గూగుల్‌లో ఉద్యోగం అంటే మాములు విషయం కాదు. సాఫ్ట్వేర్ కొలువు చేసే చాలా మందికి గూగుల్ డ్రీమ్ జాబ్. అయితే రాగిణిదాస్ అనే మహిళ సైతం గూగుల్‌లో ఉద్యోగం (Job in Google) చేయాలని కలలు కన్నది. చివరి ఇంటర్వ్యూ వరకు వెళ్లిన సెలెక్ట్ కాలేకపోయింది. ఈ ఘటన 2013లో జరిగింది. తాజాగా ఆమె గూగుల్ ఇండియా (Google India) స్టార్టప్ హెడ్‌గా నియమితులైంది. దీనిపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘‘నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది’’ అంటూ ట్విట్ చేసింది.
Google | కుంగిపోకుండా..
రాగిణి దాస్ 2013లో గూగుల్‌కు ఎంపిక కాలేదు. అయినా ఆమె కుంగిపోలేదు. అప్పటికే ఆమె 2012లో దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్‌లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యూఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. 2013లో జొమాటోలో సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. వివిధ హోదాల్లో పని చేసింది. 2017లో జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. 2020లో మహిళల కోసం ఆన్లైన్ యాప్, ఆఫ్‌లైన్ క్లబ్‌ను leap.club స్థాపనలో కీలకంగా వ్యవహరించింది. దీంతో అనుభవం, సమర్థతతో తాజాగా రాగిణి దాస్ గూగుల్ ఫర్ స్టార్టప్స్ ఇండియా విభాగానికి కొత్త హెడ్‌గా ఎంపికైంది.
Google | రాగిణి దాస్ ఎవరంటే..
రాగిణి దాస్ గురుగ్రామ్‌లో జన్మించింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసింది. ఆమె గూగుల్‌లో తన బాధ్యతల గురించి మాట్లాడుతూ.. స్టార్టప్‌లకు ప్రోత్సాహం అందిస్తామని పేర్కొంది. వాటిని అభివృద్ధి చేయడంలో సహాయ పడటానికి కృషి చేస్తామని తెలిపింది.