అక్షరటుడే, కామారెడ్డి:Kamareddy SP | మహిళల రక్షణలో కామారెడ్డి జిల్లా షీ టీం(Kamareddy district She Team) ముందుందని ఎస్పీ రాజేష్ చంద్ర(SP Rajesh Chandra) అన్నారు. జిల్లాలోని విద్యార్థినులు, మహిళా భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న షీ టీం సభ్యులు సౌజన్య, ప్రవీణలను ఎస్పీ శుక్రవారం అభినందించారు. పాఠశాలలు, కళాశాలల్లో గుడ్ టచ్(Good Touch)- బ్యాడ్ టచ్(Bad Touch) లాంటి కీలక అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. విద్యార్థులకు(Students) సరైన మార్గదర్శనం చేసిన ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు క్యాష్ రివార్డు(Cash reward) ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. షీటీం(She Team) నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు కొత్త చట్టాలపై అవగాహన పెరుగుతోందన్నారు. జిల్లా ప్రజలకు 8712686094 నంబరులో షీ టీం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
