ePaper
More
    HomeజాతీయంShashi Tharoor | మ‌త హింస‌ను రెచ్చగొట్టాల‌న్న‌దే పాక్‌.. భార‌త్ బ‌లంగా, తెలివిగా దాడి చేసిందన్న...

    Shashi Tharoor | మ‌త హింస‌ను రెచ్చగొట్టాల‌న్న‌దే పాక్‌.. భార‌త్ బ‌లంగా, తెలివిగా దాడి చేసిందన్న థ‌రూర్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Shashi Tharoor | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి (Pahalgam Terror Attack) ద్వారా పాకిస్తాన్ ఇండియాలో మ‌త విద్వేషాల‌ను రేకెత్తించ‌డానికి య‌త్నించింద‌ని కాంగ్రెస్ ఎంపీ, మాజీ మంత్రి శశి థరూర్ (Shashi Tharoor) అన్నారు. పాకిస్తాన్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై (Terrorist Camps) ఆపరేషన్ కింద భారతదేశం జరిపిన దాడులను ఆయ‌న ప్రశంసించారు.

    భారతదేశం (India) ‘బ‌లంగా, తెలివిగా దాడి చేసిందని’ అన్నారు. భారత్ చేప‌ట్టిన ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రచారంలో భాగంగా అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న అఖిల‌ప‌క్షానికి బృందానికి (all-party delegation) థ‌రూర్ నేతృత్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న న్యూయార్క్‌లోని ఇండియ కాన్సూలేట్‌లో మాట్లాడుతూ.. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడికి (Pahalgam terror attack) ఇండియా స్పందించిన తీరును ప్ర‌శంసించారు. ప్ర‌త్య‌ర్థులు ఊహించ‌ని రీతిలో బ‌లంగా, తెలివిగా దాడి చేసింద‌ని చెప్పారు.

    “నేను ప్రభుత్వానికి పని చేయను, మీకు తెలిసినట్లుగా. నేను ప్రతిపక్ష పార్టీకి పని చేస్తాను, కానీ నేను స్వయంగా భారతదేశంలోని ప్రముఖ పత్రికలో ఒక అభిప్రాయాన్ని రాశాను. రెండు రోజుల్లోనే ఇండియా పాకిస్తాన్‌ను గట్టిగా, బ‌లంగా దెబ్బతీసింది. ఇప్పుడ‌దే ప్ర‌పంచ వేదిక‌ల‌పై చెప్ప‌డానికి నేను సంతోషిస్తున్నానని” తెలిపారు. ఇండియ‌న్ ఆర్మీ (Indian Army) తొమ్మిది నిర్దిష్ట ఉగ్రవాద స్థావరాలు, ప్రధాన కార్యాలయాలు, లాంచ్‌ప్యాడ్‌లపై ఖచ్చితమైన దాడులు ఎలా చేశాయో ఆయన వివరించారు. వాటిలో మురిడ్కేలోని లష్కరే తోయిబా (Lashkar-e-Taiba), బహవల్‌పూర్‌లోని జైషే మొహమ్మద్ వంటివి ఉన్నాయ‌ని తెలిపారు.

    Shashi Tharoor | మత హింసను రేకెత్తించే ప్ర‌య‌త్నం

    ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి (Pahalgam terror attack) ద్వారా దేశంలో మ‌త విద్వేషాలు రేకెత్తించాల‌న్న కుట్ర ఉంద‌ని థ‌రూర్ తెలిపారు. ఉగ్ర‌వాదులు బాధితులను మ‌తం అడిగి మరీ చంపేశార‌ని, ఇది మత హింసను రెచ్చగొట్టే స్పష్టమైన ప్రయత్నమ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. “వారి (ఉగ్ర‌వాదులు) ముందు ఉన్న ప్రజల మతాలను గుర్తించి, మ‌త ప్రాతిపదికన వారిని చంపేశారు. దీని వెనుక భారతదేశంలోని (India) మిగిలిన ప్రాంతాలలో మ‌త హింస‌ను రెచ్చ‌గొట్టాల‌న్న ఉద్దేశం ఉంది. ఎందుకంటే బాధితులు ఎక్కువగా హిందువులు” (Hindus) అని ఆయన వివ‌రించారు.

    Shashi Tharoor | ఏక‌మైన భార‌త్‌..

    ప‌హ‌ల్గామ్ దాడి (Pahalgam (Attack) యావ‌త్ భార‌తావ‌ని ఏక‌మైంద‌ని థ‌రూర్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో (Jammu and Kashmir) రాజకీయ నాయకుల నుంచి పౌరుల వరకు, ప్రజలు సంఘీభావంగా ఎలా కలిసి వచ్చారో ఆయ‌న ఉదాహ‌రించారు. మ‌త‌ప‌ర‌మైన ఉద్రిక్త‌త‌లు రెచ్చ‌గొట్టేలా చేసిన ప్ర‌య‌త్నాల‌ను దాటుకుని దేశ ప్ర‌జ‌లు అసాధారణమైన ఐక్యత క‌నిబ‌రిచారని ప్ర‌శంసించారు. అయితే, ప‌హ‌ల్గామ్ దాడి వెనుక స్ప‌ష్ట‌మైన సందేశం ఉంద‌ని, అది ఎక్క‌డి నుంచి వచ్చిందో సందేహించడానికి ఎటువంటి కారణం లేదని ప‌రోక్షంగా పాకిస్తాన్‌ను (Pakistan) ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దాడి జ‌రిగిన గంట‌లోనే రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) బాధ్యత వహించిందని థ‌రూర్ గుర్తు చేశారు. ఈ గ్రూపు నిషేధిత లష్కరే తోయిబాకు (Lashkar-e-Taiba) చెందిన‌ద‌ని వెల్ల‌డించారు. ఈ ఉగ్ర సంస్థ‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి (United Nations) ఇప్పటికే నిషేధించింద‌ని గుర్తు చేశారు. ప‌హ‌ల్గామ్ దాడి నుంచి త‌ప్పించుకునేందుకు పాకిస్తాన్ ఎప్ప‌టిలాగే పాత పాడింద‌ని థ‌రూర్ విమ‌ర్శించారు.

    Shashi Tharoor | పాక్‌తో యుద్ధంపై ఆసక్తి లేదు

    ఉగ్ర‌వాదంపై (Terrorism) దృఢంగా పోరాడుతున్న భార‌త్‌.. ఎప్ప‌టికీ యుద్ధాన్ని కోరుకోదేని థ‌రూర్ స్ప‌ష్టం చేశారు. ఉగ్ర‌వాదంపై పోరుతో సాయుధ సంఘర్షణను కోరుకోదని తేల్చి చెప్పారు. “మాకు పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి ఆసక్తి లేదు. మన ఆర్థిక వ్యవస్థను (Pakistan economy) అభివృద్ధి చేసుకోవడానికి, 21వ శతాబ్దంలో వారు సిద్ధమవుతున్న ప్రపంచంలోకి మన ప్రజలను తీసుకెళ్ల‌డానికే ఇష్టపడతాము. కానీ, పాకిస్తానీయులు (Pakistanis) అలా కాదు. భారతదేశం నియంత్రణలో ఉన్న భూభాగాన్ని కోరుకుంటారు. వారు దానిని ఏ ధరకైనా పొందాలనుకుంటున్నారు. వారు దానిని సాంప్రదాయ మార్గాల ద్వారా పొందలేకపోతే, ఉగ్రవాదం ద్వారా పొందడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ అది ఎప్ప‌టికీ ఆమోదయోగ్యం కాదుని” తేల్చి చెప్పారు.

    More like this

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 9 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 9,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    Free sewing machine training | వెల్లుట్లలో అందుబాటులోకి ఉచిత కుట్టుమిషన్ శిక్షణ.. 50 శాతం సబ్సిడీపై మిషన్​ల అందజేత

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Free sewing machine training : కామారెడ్డి Kamareddy జిల్లా ఎల్లారెడ్డి మండలం వెల్లుట్ల...

    Tirupati-Shirdi train | చంద్రబాబు ప్రతిపాదనకు కేంద్రం సానుకూల స్పందన.. ఇకపై నిత్యం తిరుపతి – షిర్డీ రైలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tirupati-Shirdi train | తిరుపతి-షిర్డీ మధ్య నిత్యం ఎక్స్‌ప్రెస్‌​ రైలు నడపాలని ఆంధ్రప్రదేశ్​ Andhra Pradesh...