Sharwanand
Sharwanand | శర్వానంద్ – రక్షిత రెడ్డి దంపతుల మధ్య విభేదాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్తలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sharwanand | టాలీవుడ్‌(Tollywood)లో క్లాసీ నటుడిగా పేరు తెచ్చుకున్న శర్వానంద్ ప్రస్తుతం వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఎప్పుడూ వివాదాలకతీతంగా కనిపించే ఆయన గురించి ఇప్పుడు విచిత్రమైన గాసిప్స్ ఇండస్ట్రీలో హల్‌చల్ చేస్తున్నాయి.

మరి వాటిలో నిజమెంత? ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? పరిశీలిద్దాం. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, శర్వానంద్ మరియు ఆయన భార్య రక్షిత రెడ్డి ప్రస్తుతం ఒకరికి దూరంగా, తమ తమ కుటుంబాలతో వేరుగా ఉంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య విభేదాలు చెలరేగినప్పటికీ, విడాకుల విషయం ఇప్పటివరకు పరిగణనలోకి రాలేదని సన్నిహిత వర్గాల సమాచారం. ఒప్పందంతోనే కొంతకాలం విరామం తీసుకునే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Sharwanand | కుటుంబాల మధ్య కలిసే ప్రయత్నాలు

శర్వానంద్(Sharwanand) – రక్షిత దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది. ప్రస్తుతం ఆ పాప కొన్ని రోజులు శ‌ర్వా ద‌గ్గ‌ర‌, కొన్ని రోజులు ర‌క్షిత ద‌గ్గ‌ర ఉంటుంద‌ట‌. అయితే, వీరి మ‌ధ్య తలెత్తిన విభేదాల‌ని పరిష్కరించేందుకు ఇరు కుటుంబాలూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మళ్లీ జంటగా ఒక్కటవ్వాలని సన్నిహితులు ఆశిస్తున్నారు. 2023లో శర్వానంద్, రక్షిత రెడ్డి(Rakshita Reddy) జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. జైపూర్‌లో భారీగా నిర్వహించిన పెళ్లిలో రాంచరణ్, ఉపాసన వంటి సెలెబ్రిటీలు హాజరయ్యారు. శర్వా – చరణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. రక్షిత రెడ్డి ప్రముఖ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కూతురు. అంతేకాకుండా, దివంగత రాజకీయ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలు కూడా. అంటే.. రెండు కుటుంబాలూ ప్రాముఖ్యత కలిగినవే.

ఈ వార్తలపై శర్వానంద్ దగ్గరగా ఉన్నవారు ఎవరూ స్పందించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం “వేరువేరు జీవితం ప్రారంభించారా?”, “మళ్లీ కలుస్తారా?” అనే సందేహాలు బలంగా వినిపిస్తున్నాయి. అభిమానులు మాత్రం ఈ జంట మళ్లీ కలిసే అవకాశాలపైనా ఆశలు పెట్టుకున్నారు.ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల మధ్య తలెత్తే చిన్న చిన్న విభేదాలు సహజమే. కానీ అవి విడాకుల దాకా వెళ్ళకుండా పరిష్కారం కుదిరితే మంచిదే. శర్వానంద్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో “ఈ జంట మళ్లీ కలవాలి” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.