అక్షరటుడే, ఇందూరు: Chess boards | చెస్ ఆడటం ద్వారా మేధస్సుకు పదునుపెట్టాలని డీఈవో అశోక్ (DEO Ashok) పేర్కొన్నారు. నగరంలోని బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాలలో ‘చెస్ నెట్వర్క్’ (Chess Network) అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చెస్బోర్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Chess boards | చెస్ ఆడేవిధంగా ప్రోత్సహించాలి..
విద్యార్థులు చెస్ ఆడేవిధంగా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని డీఈవో సూచించారు. తద్వారా మెదడు చురుకుగా పనిచేస్తుందని ఆయన వెల్లడించారు. విద్యార్థుల్లో క్రీడల్లో ఆసక్తి పెంచేందుకు స్వచ్ఛంద సంస్థ ‘చెస్ నెట్వర్క్’ చెస్ బోర్డులు (chess boards) పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో 20మందికి ఒకటి చొప్పున సంస్థ చెస్బోర్డులు అందజేస్తోందన్నారు. ఈ సందర్భంగా సంస్థ ఫౌండర్ సుధీర్ సేవలను డీఈవో కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం శంకర్, ముప్కాల్ ఎంఈవో గేమ్సింగ్, నిజామాబాద్ రూరల్ ఎంఈవో సేవ్లా, రెండు మండలాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.